Monday, October 26, 2026
Home People –బాలికల, మహిళల ఎదుగుదలకు, రక్షణకు అందరూ బాద్యత గా తోడ్పాటు నందించాలి -డాక్టర్ అనితా రెడ్డి..

–బాలికల, మహిళల ఎదుగుదలకు, రక్షణకు అందరూ బాద్యత గా తోడ్పాటు నందించాలి -డాక్టర్ అనితా రెడ్డి..

0
12

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 26

బాలికల, మహిళల ఎదుగుదలకు, రక్షణకు, విద్యకు అందరూ తోడ్పాటు నందించాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వ విద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, ఈరోజు హన్మకొండ లోని ప్రభుత్వ స్వధార్ హోమ్ ను సందర్శించి అక్కడ మహిళలు, పిల్లలతో డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ… ఆడపిల్ల లేనిదే సృష్టి లేదని, ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అని నేటి ప్రంపంచంలో ఆడపిల్లలు, మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నరని వారి అభ్యున్నతికి తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా ప్రోత్సాహం అందించాలని అన్ని రంగాల్లో ఆడపిల్లలు, మహిళలుఎదగాలని వారు వినడం నుండి మాట్లాడి, చర్చించి తన ఆలోచనలను ఆచరణలో పెట్టే స్తాయికి, తమ హక్కులను తమ అభివృద్ధికి ఉపయోగించుకునే స్తాయికి చేరాలని అన్నారు,పౌష్టికాహార విలువలు, విద్యా విలువలు, మహిళా ఎంపవర్మెంట్ తదితర అంశాలపై పిల్లలకు డాక్టర్ అనితా రెడ్డి అవగాహన కల్పించారు సమాజంలోని ఆదరణ, నిరాదరణకు గురైన బాలికలను ,మహిళలను చేరదీసి వారికి విద్యా బుద్ధులు నేర్పించుటలో, రక్షణ, ధైర్యము కల్పించడంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బాలికల అభివృద్ధికి విద్య చాలా దోహదం చేస్తుందని, నిరుపేదలైన తల్లి తండ్రు లు బాలికల ,మహిళల రక్షణ సంరక్షణ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని ప్రతి తల్లి తండ్రి బాలికలకు బాల్యవివాహాలు చేయకుండా బాల కార్మికులుగా మార్చకుండా వారిని సరైన దిశా నిర్దేశం చేయాలని అన్నారు. బాలల రక్షణ సంరక్షణ కోసం గ్రామ మండల జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టుతున్నామని బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బాలికలకు అందమైన బాల్యాన్ని బహుమతిగా అందించాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, బాలికలు ,మహిళలు తమ ఆలోచనలను పంచుకొని ఆచరణలో పెట్టుకొనే స్థాయి కి చేరాలన్నారు, అనంతరం అందరికి పండ్లు పంపిణీ చేసారు డాక్టర్ అనితా రెడ్డి, సిబ్బంది, పిల్లలు, మహిళలుపాల్గొన్నారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.