Monday, October 26, 2026
Home People –గ్రూప్–1 అధికారులకు జీడబ్ల్యూఎంసీలో శిక్షణ పూర్తి… –కమిషనర్ టీ. వెంకన్నను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు…

–గ్రూప్–1 అధికారులకు జీడబ్ల్యూఎంసీలో శిక్షణ పూర్తి… –కమిషనర్ టీ. వెంకన్నను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు…

0
14

📰 Generate e-Paper Clip

జిడబ్ల్యూఎంసి, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక  అక్టోబర్ 26:

2025 గ్రూప్–1 పరీక్షల ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు పొందిన తోట సోని, జి. రాహుల్‌లు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో మూడు రోజుల పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు.ఈ శిక్షణలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు, పరిపాలనా విధానాలు, కార్యాలయ నిర్వహణ, పట్టణ స్థానిక సంస్థల విధులు, బాధ్యతలపై అవగాహన పొందారు. పట్టణాభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు అందించే పౌర సేవలు, వివిధ విభాగాల సమన్వయం తదితర అంశాలను తెలుసుకున్నారు.శిక్షణ అనంతరం సోమవారం జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్నను ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను కమిషనర్ అభినందించారు. శిక్షణ ద్వారా మున్సిపల్ పరిపాలన, వివిధ విభాగాల పనితీరుపై అవగాహన పొందడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.