–గ్రూప్–1 అధికారులకు జీడబ్ల్యూఎంసీలో శిక్షణ పూర్తి… –కమిషనర్ టీ. వెంకన్నను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు…

జిడబ్ల్యూఎంసి, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక  అక్టోబర్ 26: 2025 గ్రూప్–1 పరీక్షల ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు పొందిన తోట సోని, జి. రాహుల్‌లు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో మూడు రోజుల పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు.ఈ శిక్షణలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు, పరిపాలనా విధానాలు, కార్యాలయ నిర్వహణ, పట్టణ స్థానిక సంస్థల విధులు,...