Friday, October 23, 2026
Home Politics *సీనియర్ జడ్పీటీసీ సారయ్య మృతి పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు తీవ్ర సంతాపం* *సారయ్య...

*సీనియర్ జడ్పీటీసీ సారయ్య మృతి పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు తీవ్ర సంతాపం* *సారయ్య పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గారు* మాజీ కార్పొరేటర్ తూర్పటి సులోచన గారి భర్త, సీనియర్ జడ్పీటీసీ సభ్యులు సారయ్య గారు మృతి చెందడం పట్ల వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు గారు* తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సారయ్య గారి మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సారయ్య గారి మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు వారి నివాసానికి వెళ్లి పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ… సారయ్య గారి మృతి బాధాకరమని, వారి కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. సారయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, 14 వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0
10

📰 Generate e-Paper Clip

–సారయ్య పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు….

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 22

మాజీ కార్పొరేటర్ తూర్పటి సులోచన  భర్త, సీనియర్ జడ్పీటీసీ సభ్యులు సారయ్య  మృతి చెందడం పట్ల వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సారయ్య  మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సారయ్య  మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  వారి నివాసానికి వెళ్లి పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ… సారయ్య  మృతి బాధాకరమని, వారి కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. సారయ్య  ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, 14 వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.