పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లె గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించిన మంద బాబురావు అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వరంగల్లోని ఆరుషి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ శ్రేణులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. మంద బాబురావు మృతదేహాన్ని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు…అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని అర్థం చేసుకున్న జిల్లా అధ్యక్షుడు అయూబ్ , ఆసుపత్రి బిల్లును పూర్తిగా చెల్లించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేలా సహకారం అందించారు.కాంగ్రెస్ పార్టీ కోసం మంద బాబురావు గారు అందించిన సేవలను ఈ సందర్భంగా అయూబ్ స్మరించుకున్నారు. ఆయన మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మంద బాబురావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని అయూబ్ ఆకాంక్షించారు…ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…




