మంద బాబురావు మృతి పట్ల సంతాపం తెలుపుతూ మృత దేహానికి నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షుడు అయూబ్ ….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లె గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించిన మంద బాబురావు అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వరంగల్లోని ఆరుషి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ శ్రేణులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. మంద బాబురావు మృతదేహాన్ని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు…అనంతరం...