Thursday, October 22, 2026
Home People –బతుకమ్మ,దసరా పండుగలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి… —బల్దియా కమిషనర్ టి. వెంకన్న… –వినాయక నిమజ్జనం విజయవంతం...

–బతుకమ్మ,దసరా పండుగలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి… —బల్దియా కమిషనర్ టి. వెంకన్న… –వినాయక నిమజ్జనం విజయవంతం చేసిన అధికారులకు అభినందనలు….

0
64

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  GWMC,  సెప్టెంబర్ 28

అక్టోబర్ 10వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, గతంలో మాదిరిగానే నగరంలోని ఆయా ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం జీ డబ్ల్యు ఎం సి ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీ డబ్ల్యూ ఎం సి పరిధిలోని 66 డివిజన్లలో బతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో రోడ్ల మరమ్మతులు, డస్టింగ్, విద్యుద్దీకరణ,గుర్రపు డెక్క తొలగింపు, పారిశుధ్య నిర్వహణ, మంచినీటి తదితర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బతుకమ్మ విగ్రహాలకు అవసరమైన పెయింటింగ్, పరిసరాల పరిశుభ్రత, లైటింగ్ వంటి పనులను ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.ఇటీవల నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసిన తీరును కమిషనర్ అభినందించారు. అదే స్ఫూర్తితో బతుకమ్మ, దసరా పండుగలకు కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.దసరా పండుగ రోజున ప్రజలు అధికంగా వచ్చే ఉర్సు గుట్ట, సిద్ధేశ్వర ఆలయం, రంగసాయిపేట తదితర ప్రాంతాల్లో గతంలో మాదిరిగానే ఇతర శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, రహదారులు, విద్యుద్దీకరణ, మంచినీటి సౌకర్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.పండుగల సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే గుర్తించి పూర్తి చేయాలని, పండుగ రోజుల్లో కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కమిషనర్ వెంకన్న స్పష్టం చేశారు.బతుకమ్మ,దసరా పండుగలను పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణంలో ప్రజలు ఆనందంగా జరుపుకునేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కమిషనర్ ఆదేశించారు.ఈ సమావేశం లో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్ కుమార్, సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి డి ఎఫ్ ఓ శంకర్ లింగం, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, సి హెచ్. ఓ లక్ష్మారెడ్డి,డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.