–బతుకమ్మ,దసరా పండుగలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి… —బల్దియా కమిషనర్ టి. వెంకన్న… –వినాయక నిమజ్జనం విజయవంతం చేసిన అధికారులకు అభినందనలు….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 28 అక్టోబర్ 10వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, గతంలో మాదిరిగానే నగరంలోని ఆయా ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం జీ డబ్ల్యు ఎం సి ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...