కామారెడ్డి పరివర్తన అవాజ్ :జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులు ప్రయాణిస్తున్న ఆటో ప్రియా టాకిస్ రోడ్డు వద్ద బైక్ అడ్డు రావడంతోఅదుపు తప్పి బోర్లా పడిన విషయం తెలిసిందే .ఈ ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందించడం జరుగింది.వీరిలో 7 గురి పరిస్థితి సాధారణంగా,ఇద్దరికి గాయాలు ఎక్కువ అయ్యి సర్జరీ చేసే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు.ఈ విషయం తెలుసుకొని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లి బాధితులని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది.RMO సంతోష్ మరియు ఇత్ర వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలను అందించాలని,క్షతగాత్రులకు అండగా ఉంటామని ధైర్యం ఇచ్చారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు ,TPO వినీత్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజ్, ప్రశాంత్ ,రాజాం, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…




