హిందూ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి ప్రతినిధ అక్టోబర్ 21:, కామారెడ్డి జిల్లా కేంద్రంలో హిందూ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన తుల్జా భవాని అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాల అనంతరం అమ్మవారి విగ్రహ నిమజ్జనానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల జయజయధ్వానాలు, భక్తిశ్రద్ధల మధ్య అమ్మవారిని నిమజ్జనానికి ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా హిందూ సేన అధ్యక్షుడు మాయ రాములు మాట్లాడుతూ, ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. దుర్గాభవాని మాత మాలలు ధరించి భక్తిశ్రద్ధలతో దీక్ష చేపట్టిన భక్తులపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మాయ రాములు బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు విప్పుల్ జైన్, పండ్ల ప్రవీణ్, గణేష్, నరసింహులు, గోపి, సంతోష్, ఆకాష్, రంజిత్, శ్యామ్, తుమ్మల, రాకేష్తో పాటు హిందూ సేన యూత్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




