పరివర్తన ఆవాజ్ బాన్సువాడ : భారతీయ స్వీట్లు మరియు బేకరీ ఉత్పత్తులపై ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ G. విక్రమ్ బాన్సువాడ పట్టణంలోని పలు స్వీట్ షాపులు మరియు బేకరీలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా పలు ఆహార వ్యాపార సంస్థలు FSSAI రిజిస్ట్రేషన్ / లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే పలు పరిశుభ్రత లోపాలు కూడా గుర్తించబడ్డాయి. తనిఖీలలో అనుమానాస్పదంగా ఉన్న ఆహార నమూనాలను అక్కడికక్కడే సేకరించి విశ్లేషణ నిమిత్తం ల్యాబొరేటరీకి పంపడం జరిగింది.పరిశుభ్రత పాటించని మరియు FSSAI లైసెన్స్ / రిజిస్ట్రేషన్ లేని ఆహార వ్యాపార నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగింది.ప్రజలు పరిశుభ్రత పాటించే దుకాణాల నుండి మాత్రమే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని, అలాగే కొనుగోలు చేసే ముందు లేబుల్స్ ను సరిగ్గా చదివి తెలుసుకోవాలని సూచించడమైనది




