Friday, October 23, 2026
Home Politics లింగాల కేదారి కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత… –బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా...

లింగాల కేదారి కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత… –బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

0
22

📰 Generate e-Paper Clip

హన్మకొండ  పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 3

ఇటీవల జరిగిన విషాదకర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన లింగాల పుష్పలత – కేదారి దంపతుల కుటుంబాలకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అందజేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి  తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు హన్మకొండలోని వారి నివాసానికి వెళ్లి చెక్కులను అందించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో దంపతులను కోల్పోయిన కుటుంబానికి జరిగిన నష్టం ఎంతో బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో ప్రభుత్వం మరియు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఆకలితో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు లింగాల కేదారి దంపతులు ఎంతో మందికి ఆకలి తీర్చిన గొప్ప మనసున్న దంపతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయాన్ని అందించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,అధికారులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.