Friday, October 23, 2026
Home Politics మహిళలకు రిజర్వేషన్లు, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలి…—-వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్…

మహిళలకు రిజర్వేషన్లు, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలి…—-వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్…

0
24

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్  తెలుగు దిన పత్రిక  అక్టోబర్ 2

మట్టేవాడలోని సెయింట్‌నరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో, వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో* నిర్వహించిన ఒక్కరోజు మహిళల రీట్రీట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు  నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ…మహిళలకు రిజర్వేషన్లు, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలి.నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి నిధులు మరియు స్థలం కేటాయించడంతో పాటు, వరంగల్‌లోని వివిధ క్రిస్టియన్ సొసైటీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఒకే వేదికగా పనిచేసేలా చేశాముఅలాగే మణిపూర్‌లో జరిగిన ఘటనలు, కాశీబుగ్గలో జరిగిన ఘటనలను ఖండిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి బాధితులకు అండగా నిలిచామని తెలిపారు.ఎవరు అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రతి ఒక్కరికీ హక్కులు, గౌరవం, సమానత్వం కల్పించడమే తన ధ్యేయమని నరేందర్  స్పష్టం చేశారు.అనంతరం కమిటీ మహిళలను శాలువాతో సత్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ సభ్యులు, పాస్టర్లు, 28 చర్చిల మహిళా ప్రతినిధులు, ఫాదర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.