పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక హన్మకొండ అక్టోబర్ 02
హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల మరియు భధిరుల ఆశ్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిధిగా అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ…సత్యం, అహింస, శాంతి, సేవ అనే మహాత్మా గాంధీజీ చూపిన మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు., ప్రతి వారు చూపిన మంచి మార్గములో నడవాలని, మహనీయులను స్పూర్తిగా తీసుకోవాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు అనంతరం పిల్లలకు అల్పాహారం అందించారు, ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, సంస్థ నిర్వహకులు సుచరిత, రాజేందర్ రెడ్డి, భార్గవి, రాఘవ తదితరులు పాల్గొన్నారు..




