పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 డిస్ట్రిక్ట్ లీగల్ అధారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో ఆంటీ డ్రగ్స్ అవగాహన నిర్వహించగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అధారిటీ సెక్రటరీ వెంకట హైమ పూజిత, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆంటీ డ్రగ్ కమిటీ మెంబర్ ,అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ లోని హెల్పింగ్ హండ్ డిఅడిక్షన్ సెంటర్ ను సందర్శించడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి ని ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది, సంస్థ నిర్వహకులు రాము ని సంస్థ గురించి, ఏ విధమైన ఇబ్బంది కలిగిన వారిని సంస్థ లో అడ్మిట్ చేసుకుంటారు ఏ రకంగా కౌన్సిలింగ్ ఇస్తారు, ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు, ట్రీట్మెంట్ అయిపోయిన వారిని తిరిగి ఫాలోఅప్ చేస్తున్నారా వంటి వివరాలను అడిగి తెలుసు కున్నారు అనంతరం అతి మద్యం మరియు ఆన్టీ డ్రగ్స్ (మత్తు పదార్థాలు) ఎబ్యుస్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జడ్జి పూజిత , డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ మత్తుపదార్థాలు తీసుకోవడం , కొనడం,అమ్మడం, అత్యధికముగా మద్యం సేవించడం చట్ట రీత్యా నేరం అన్నారు, ఆన్టీ డ్రగ్ ఎబ్యూస్ పై మరియు పలు చట్టాలపై ,పలు అంశాలపై అర్థం అయ్యేలా అవగాహన కల్పించారు, చెడు వ్యసనాలకు బానిసై మత్తు పదార్థాలకు బనిసలై ఎంతో మంది తమ జీవితాలను నాశనము చేసుకుంటున్నారని వాటి బారిన పడవద్దని అన్నారు, సంబందం లేనివారి వారి తో పరిచయాలు, స్నేహలు పెంచుకోవద్దని వారు ప్రలోభ పెట్టి నా చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు చెప్పారు, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 100 కి లేదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అధారిటీ, లేదా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేయాలని తెలియచేసారు, ఈ కార్యక్రమం లో జడ్జి పూజిత, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆంటీ డ్రగ్ కమిటీ మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి, సంస్థ నిర్వహకులు రాము, అడ్వకేట్ రవి, పవన్ తదితరులు పాల్గొన్నారు.




