Friday, October 23, 2026
Home Politics –భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న :ఎంపీ వద్దిరాజు రవిచంద్ర….దాస్యం వినయ్ భాస్కర్,నన్నపనేని నరేందర్‌తో కలిసి ప్రత్యేక పూజలు….

–భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న :ఎంపీ వద్దిరాజు రవిచంద్ర….దాస్యం వినయ్ భాస్కర్,నన్నపనేని నరేందర్‌తో కలిసి ప్రత్యేక పూజలు….

0
13

📰 Generate e-Paper Clip

వరంగల్, పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆయనతో పాటు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.కాకతీయుల కాలం నాటి చారిత్రక పుణ్యక్షేత్రమైన భద్రకాళి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా దుర్గామాత అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన రవిచంద్రకు ఆలయ కమిటీ సభ్యులు,అధికారులు,వేద పండితులు మేళతాళాలు,పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం రవిచంద్రతో పాటు దాస్యం వినయ్ భాస్కర్,నన్నపనేని నరేందర్ తదితరులు తమ గోత్రనామాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.పూజల అనంతరం ప్రధాన అర్చకులు శేషు అయ్యగారు.వేద పండితులు నాగరాజు శర్మ, అరవింద్ శర్మ, వారికి శాలువాలు కప్పి సత్కరించారు.అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి ఈవో & దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాయల సునీత, సూపర్డెంట్ కుచన హరినాథ్,మున్నూరు కాపు నాయకులు కూసం శ్రీనివాస్, సిబ్బంది నాగులు, సందీప్, ప్రభాకర్, తదితరులతోపాటు విఆర్సి యూత్ సభ్యులు పాల్గొన్నారు

–-భద్రకాళి అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు పూలంగి సేవలు:వద్దిరాజు రవిచంద్ర….

వరంగల్‌లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవస్థానంలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారికి పూలంగి సేవలు నిర్వహించే భాగ్యం తమ కుటుంబానికి లభించడం అదృష్టంగా భావిస్తున్నామని రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీ భద్రకాళి అమ్మవారికి,అమ్మవారి శేష వాహనాలకు వివిధ రకాల పుష్పాలు, గజమాలలతో పూలంగి సేవలు నిర్వహించినట్లు వెల్లడించారు. రంగురంగుల పుష్పాలతో అమ్మవారిని, వాహనాలను సర్వాంగసుందరంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ పవిత్రమైన సేవలో భాగస్వాములయ్యే అవకాశాన్ని తమ కుటుంబానికి కల్పించిన శ్రీ భద్రకాళి అమ్మవారికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.