Thursday, October 22, 2026
Home People —బతుకమ్మ, విజయదశమి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు.. కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

—బతుకమ్మ, విజయదశమి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు.. కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

0
15

📰 Generate e-Paper Clip

వరంగల్, అక్టోబర్ 6: పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక

బతుకమ్మ నవరాత్రులు, విజయదశమి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా, వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉత్సవాల ఏర్పాట్లపై ఉర్సు రంగలీల మైదానంలో పోలీస్ కమిషనర్ శ్వేత, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, GWMC కమిషనర్ టి.వెంకన్న, ఉత్సవ కమిటీ సభ్యులు సంజయ్ తదితరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ….బతుకమ్మ నవరాత్రుల సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు సూచించారు.తొమ్మిది రోజుల పాటు మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని, ప్రతిరోజూ కార్యక్రమాలు ముగిసిన వెంటనే వ్యర్థాలను తొలగించి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారులను ముందుగానే పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు.

—5-6 వేల మందికి ఏర్పాట్లు…

విజయదశమి సందర్భంగా రాంలీలా మైదానంలో నిర్వహించే రావణ వధ కార్యక్రమానికి సుమారు 5 వేల నుంచి 6 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. గత రెండేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్యం, అగ్నిమాపక ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను కోరారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేతా మాట్లాడుతూ.. గతం లో నిర్వహించిన బతుకమ్మ ,దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ట్రాఫిక్ డైవర్షన్ , ట్రాఫిక్ జామ్ నియాత్రణ ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం ఉత్సవ కమిటీ సహకరిస్తుందని అన్నారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ…

కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ట్రాఫిక్, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సౌండ్‌ నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. దసరా రోజున ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు టూరిజం, డీఆర్‌డీవో ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు తో పాటు
సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు…

ఉత్సవాలకు వచ్చే చిన్నారులు తప్పిపోకుండా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పిల్లల చేతికి తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌తో కూడిన ట్యాగ్‌ను ఫ్రెండ్షిప్ బ్యాండ్ తరహాలో ఏర్పాటు చేస్తే, తప్పిపోయిన సందర్భంలో వారిని తల్లిదండ్రులకు సులభంగా అప్పగించేందుకు వీలుంటుందని తెలిపారు.ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సహకరించాలని కోరారు.ఈ కార్యమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్, డియార్వో విజయలక్ష్మి, ఆర్డీవో సుమ సంబంధిత శాఖఅదికారులు మరియు,ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్ నవీన్ రాజు కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్ బాబు, జనరల్ సెక్రెటరీ మెడిది మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న గౌడ్, సంయుక్త కోశాధికారి వెలిది శివమూర్తి, ఉత్సవ కన్వీనర్ వొడ్నాల నరేందర్, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.