పరివర్తన ఆవాస్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 5
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 248 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో రెవెన్యూ శాఖకు 90, జీడబ్ల్యూఎంసీకి 61, హౌసింగ్ శాఖకు 13, డీఆర్డీవో 24, రాగా ఇతర శాఖలకు సంబంధించిన 48 దరఖాస్తులు వచ్చాయి.అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు వెంటనే ఎండార్స్ చేసి, సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ ప్రజావాణిలో రెవెన్యూ, హౌసింగ్, జీడబ్ల్యూఎంసీ,డిఆర్డిఓ శాఖల పరిధిలో అధికంగా దరఖాస్తు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు.ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పై వచ్చే పిటిషనర్లు సంయమనం పాటించాలని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, దేనికైనా సమయం వచ్చే వరకు వేచి ఉండాలని ఆవేశాలతో అర్థాలకు కారణాలు కావద్దని పిటిషన్లకు జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్ కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, డియార్వో విజయలక్ష్మి , జడ్పీ సీఈవో వసంత, డీఎంహెచ్‌వో డా. రాజి రెడ్డి,కలెక్టరేట్ సూపరిడెంట్ విశ్వప్రసాద్, హౌసింగ్ డి ఇ విష్ణు వర్ధన్ రెడ్డి తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.




