Thursday, October 22, 2026
Home People —పర్వతగిరిలో కంది పప్పు మిల్లు ఏర్పాటుకు స్థల పరిశీలన— —అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై...

—పర్వతగిరిలో కంది పప్పు మిల్లు ఏర్పాటుకు స్థల పరిశీలన— —అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం—

0
21

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30 వరంగల్ 

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం పర్వతగిరి మండలంలోని కొంకపాక, పర్వతగిరి మార్కెట్‌ యార్డులను క్షేత్ర స్థాయి అధికారులతో సందర్శించారు.వీవోల సభ్యులతో కలిసి ఆర్గానిక్ పప్పు దినుసులు, మిల్లెట్స్,మిల్లు,అరటి,మరియు మోదుగు ఆకుల తో విస్తరులు, టిఫిన్ ప్లాట్,తదితర ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించారు.మహిళా సంఘాల ఆధ్వర్యంలో కంది, ఇతర పప్పు దినుసుల మిల్లును ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా పంటలకు విలువ జోడించడంతో పాటు మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చించారు.మిల్లు ఏర్పాటుకు అవసరమైన స్థలం,వివో బిల్డింగ్ కు స్థల పరిశీలన,మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించారు.అనంతరం పర్వతగిరి మండలంలోని దౌలత్‌నగర్, ఉట్టి తండా అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత సరిగా పాటించకపోవడంపై సంబంధిత అంగన్‌వాడీ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.చిన్నారులకు యూనిఫాం తప్పనిసరిగా ఉండేలా చూడాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.శుభ్రత పరిశుభ్రత తప్పనిసరిగా ఉండేలా ఆయాలు చూడాలని ఆదేశించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై కూడా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించని అంగన్‌వాడీ టీచర్లకు, కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయని అంగన్‌వాడీ సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.ఉట్టి తండ లోని బుద్ధి మాధ్యమం తో ఉన్న పిల్లలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పలకరించి వారిని భవిత సెంటర్ల కు పంపించాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు..ఈ కార్యక్రమం లో డీఆర్డీవో నాగపద్మజా,జిల్లా సంక్షేమ అధికారి నాగమణి, పర్వత గిరి తహసిల్దార్ వెంకటస్వామి,
ఎంపీడీవో తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.