—పర్వతగిరిలో కంది పప్పు మిల్లు ఏర్పాటుకు స్థల పరిశీలన— —అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం—

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30 వరంగల్  జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం పర్వతగిరి మండలంలోని కొంకపాక, పర్వతగిరి మార్కెట్‌ యార్డులను క్షేత్ర స్థాయి అధికారులతో సందర్శించారు.వీవోల సభ్యులతో కలిసి ఆర్గానిక్ పప్పు దినుసులు, మిల్లెట్స్,మిల్లు,అరటి,మరియు మోదుగు ఆకుల తో విస్తరులు, టిఫిన్ ప్లాట్,తదితర ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించారు.మహిళా సంఘాల ఆధ్వర్యంలో కంది, ఇతర పప్పు దినుసుల మిల్లును ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా పంటలకు విలువ జోడించడంతో పాటు మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి, ఆదాయ...