హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రికఅక్టోబర్ 04
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నయీమ్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన SGM కాకతీయ ఫ్యాబ్రిక్, యునైటెడ్ హక్ వస్త్ర షోరూమ్‌లను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… పండుగ వేళ నూతనంగా ప్రారంభించిన వ్యాపార సంస్థలు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని షోరూమ్ నిర్వాహకులకు సూచించారు. నూతన వ్యాపారాల ద్వారా స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.తమ ఆహ్వానాన్ని మన్నించి షోరూమ్‌ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు.




