Thursday, October 22, 2026
Home People ఆయిల్‌పామ్ రైతులకు శాస్త్రీయ సాగుపై అవగాహన… —నీటి పొదుపు పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి: కలెక్టర్...

ఆయిల్‌పామ్ రైతులకు శాస్త్రీయ సాగుపై అవగాహన… —నీటి పొదుపు పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి: కలెక్టర్ సత్య శారద… —వర్ధన్నపేట మండల రైతు కమిటీ సభ్యుల హాజరు…

0
15

📰 Generate e-Paper Clip

వరంగల్, పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక    అక్టోబర్ 08…: ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో భూగర్భ జలాలు, నీటి వనరులను సంరక్షించుకుంటూ బిందు సేద్యం ద్వారా ఆయిల్‌పామ్ సాగులో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రైతులకు సూచించారు. తక్కువ నీటితో అధిక లాభాలు అందించే పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.గీసుకొండ మండలం కొనేమాకులలోని పీడీఆర్ గార్డెన్స్‌లో గురువారం వరంగల్ జిల్లా ఆయిల్‌పామ్ రైతుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని, అధిక నీటి వినియోగం అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండి నీటి పొదుపు పద్ధతులను అవలంబించాలని సూచించారు.ఏలూరు జిల్లా పెదవేగిలోని జాతీయ ఆయిల్‌పామ్ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వి. ప్రసాద్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయిల్‌పామ్ సాగులో నీటి, ఎరువుల యాజమాన్యం, పరాగసంపర్క కీటకాల వినియోగం, గెలల అభివృద్ధి తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త రాజు పోషకాల యాజమాన్యంపై సూచనలు అందించారు.జిల్లా ఉద్యాన అధికారి ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు ఉద్యానశాఖ అందిస్తున్న రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

–వర్ధన్నపేట మండల కమిటీ హాజరు…

  1. ఈ సదస్సుకు వర్ధన్నపేట మండల ఆయిల్‌పామ్ రైతు కమిటీ అధ్యక్షుడు తక్కలపల్లి సత్యనారాయణ రావు, సభ్యులు, పలువురు రైతులు హాజరయ్యారు. ఆయిల్‌పామ్ మొక్కల పెరుగుదల, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ, తోటల సంరక్షణపై వారు అవగాహన పొందారు. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ కృషి చేస్తుందని అధ్యక్షుడు తెలిపారు.ఈ సదస్సులో ఆయిల్‌పామ్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, ఉద్యాన అధికారులు రాకేష్, జ్యోతి, మానస తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.