ఆయిల్‌పామ్ రైతులకు శాస్త్రీయ సాగుపై అవగాహన… —నీటి పొదుపు పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి: కలెక్టర్ సత్య శారద… —వర్ధన్నపేట మండల రైతు కమిటీ సభ్యుల హాజరు…

వరంగల్, పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక    అక్టోబర్ 08...: ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో భూగర్భ జలాలు, నీటి వనరులను సంరక్షించుకుంటూ బిందు సేద్యం ద్వారా ఆయిల్‌పామ్ సాగులో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రైతులకు సూచించారు. తక్కువ నీటితో అధిక లాభాలు అందించే పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.గీసుకొండ మండలం కొనేమాకులలోని పీడీఆర్ గార్డెన్స్‌లో గురువారం వరంగల్ జిల్లా ఆయిల్‌పామ్ రైతుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు....