Thursday, October 22, 2026
Home People ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నీలిమ రెడ్డి పిలుపు…

ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నీలిమ రెడ్డి పిలుపు…

0
12

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 9

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ముందస్తు బతుకమ్మ సంబరాలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రెడ్డి  వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు.మధ్యాహ్నం ఆర్ట్స్ కాలేజీ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్  నేరెళ్ల శారద, KUDA చైర్‌పర్సన్  గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి పాల్గొన్నారు.అనంతరం సాయంత్రం ఆరెపల్లిలోని మెరిడియన్ స్కూల్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథులుగా హాజరై వారితో కలిసి బతుకమ్మ ఆడారు.అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్ క్రాంతినగర్‌లో బొడ్డెమ్మ వేడుకల చివరి రోజు కార్యక్రమానికి హాజరై స్థానిక మహిళలతో కలిసి బొడ్డెమ్మ ఆడుతూ సందడి చేశారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.