పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 16
ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, వరంగల్ ఆద్వర్యంలో మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన సుబేదారీలోని వారి కార్యాలయంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా , సంస్థ సి. ఈ. ఓ రాం మూర్తి విశిష్ట అతిధిగా బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ఆ బతుకమ్మ సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు , పెద్ద ఎత్తున మహిళలు, సిబ్బంది బతుకమ్మలు పేర్చి ఆట పాటలతో అలరించారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ… మన తెలంగాణా పండుగ బతుకమ్మ అని ఈ పండుగ లో ప్రత్యేకత అందరి దేవుళ్లను పూలతో పూజిస్తే ఈ పండుగ ప్రత్యేకత పూలనే అమ్మవారిగా కొలవడం అని అన్నారు, మహిళలు తమ పసుపు కుంకుమలు కాపాడు తల్లి గా గౌరమ్మ ని కొలుస్తారని, ఇది ఏ దేశంలో లేని పండుగ అని, ఇది మన తెలంగాణా రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం అని, అన్నారు, పండుగ అంటే పదిమందిని సంతోషపెట్టడం అన్నారు,మహిళలు , కోలాటం డాన్సులు, బతుకమ్మ పాటలు ఎంతో అలరించాయని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు , అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి ,రామమూర్తి, శ్రీనివాస్ ,రమేష్ ,మహిళలు తదితరులు పాల్గొన్నారు




