Thursday, October 22, 2026
Home Sports —హనుమకొండలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్...

—హనుమకొండలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

0
67

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 హనుమకొండ 

 

హనుమకొండ: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) హనుమకొండ జిల్లా స్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌ను కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.జిల్లా స్థాయి ఎంపికలు, పోటీల్లో భాగంగా వివిధ క్రీడాంశాల్లో సుమారు 2,000 మంది విద్యార్థి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా ఎంపికైన క్రీడాకారులు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం పొందనున్నారు.క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాల్గొన్న క్రీడాకారులందరికీ భోజన వసతితో పాటు మంచినీటి సౌకర్యాన్ని ప్రత్యేకంగా కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్,జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్,జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ప్రశాంత్, హనుమకొండ SGFI ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసుదేవరావు, అండర్-19 ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఏ. ప్రభాకర్ రెడ్డి, మల్యాల దేవేందర్, PETA TS సెక్రెటరీ కిషన్ నాయక్, దశ్రునాయక్, శ్యాం ప్రసాద్, టి. రాముడు, ఎస్. పార్థసారథి, మల్లారెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.