Thursday, October 22, 2026
Home People ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ…

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ…

0
62

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  వరంగల్, సెప్టెంబర్ 27:

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలను బి.సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌లోని గోపాలస్వామి గుడి సమీపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య,
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్,
కూడా చైర్మన్ గుండు సుధారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, లు పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.బాపూజీ తెలంగాణ ఉద్యమం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, వరంగల్ ఆర్డీవో సుమ, వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.