Author: Sai Krishna

పరివర్తన అవాజ్ న్యూస్ మార్చి 22:   తెలంగాణ : రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోషణ్ ట్రాకర్ ద్వారా అంగన్వాడీ వివరాలను అప్డేట్ చేసేందుకు ఇదివరకే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పాతబడిపోవడంతో.. కొత్త ఫోన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పది రోజుల్లోనే సీఎం రేవంత్ ఆ ఫోన్లను అందజేయనున్నట్లు సమాచారం. కొత్తగా 4G ర్యామ్, 64GB మెమొరీ సామర్థ్యం ఉన్న ఫోన్లను ఇవ్వనున్నారు. అంగన్వాడీ టీచర్ ప్రతిరోజు ఫోన్‌లో పోషణ్ ట్రాకర్ యాప్‌లో 14 రకాల వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.​

Read More

పరివర్తన అవాజ్ న్యూస్ : మార్చి 23వ తేదీ, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Read More

  పరివర్తన అవాజ్ న్యూస్ :టేకులపల్లి,మార్చి21 మండల పరిధిలోని టేకులపల్లి మరియు గోల్యతండా గ్రామ పంచాయతీల ఉమ్మడి వారపు సంత నిర్వహణ కోసం ఈనెల 23వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్‌లు బోడ బాలు నాయక్,లకావత్ నాకా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఒక సంవత్సరం కాలపరిమితికి గాను నిర్వహించే ఈ వేలం పాట గత సంవత్సరం టేకులపల్లి గ్రామపంచాయతీ లో జరగగా ఈ సారి సోమవారం ఉదయం 10 గంటలకు గోల్యతండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతుందని వారు పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం వేదిక మార్పు ఉంటుంది.వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వేలం దారులు ₹50,000/-(యాభై వేల రూపాయలు)ముందస్తు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వేలం నిర్వహించబడుతుందని,వేలం దారులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Read More

టేకులపల్లి మరియు గోల్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు మరియు ఆసక్తి గల వేలం దారులకు తెలియజేయునది ఏమనగా:

మన గ్రామ పంచాయతీకి సంబంధించిన సంత వేలంపాట నిర్వహించబడుతుంది. ఈ వేలంపాటలో పాల్గొనదలచిన వారు క్రింది వివరాలను గమనించగలరు:

📅 వేలం తేదీ: 23/03/2026
📍 వేలం స్థలం: గోల్యతండా గ్రామ పంచాయతీ కార్యాలయం
⏰ వేలం సమయం: ఉదయం 10:00 గంటలకు
💰 ముందస్తు డిపాజిట్: ₹50,000/- (యాభై వేల రూపాయలు)
📆 కాలపరిమితి: ఒక సంవత్సరం (1 సంవత్సరం)

📌 నిబంధన:
వేలంలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా పై పేర్కొన్న డిపాజిట్ మొత్తాన్ని నిబంధనల ప్రకారం ముందుగా జమ చేయాలి.

కావున ఆసక్తి గలవారు నిర్ణీత సమయంలోగా డిపాజిట్ చెల్లించి, వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరడమైనది.బోడ బాలు నాయక్
(సర్పంచ్, టేకులపల్లి)

లకావత్ నాకా నాయక్
(సర్పంచ్, గోల్యతండా)

ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

అక్షరమే ఆయుధంగా..ఆశయమే ఊపిరిగా:ఉత్తమ అధ్యాపకుడు ‘బాణోత్ జుంకీలాల్’  ఖమ్మం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్ న్యూస్ జనవరి 27   ఖమ్మం గడ్డపై మెరిసిన అక్షర శిఖరం: నిరుపేద గిరిజన గూడెం నుంచి వచ్చి, నేడు వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న అక్షర యోధుడు శ్రీ బాణోత్ జుంకీలాల్.సింగరేణి మండల గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల తెలుగు అధ్యాపకుడిగా ఆయన చేస్తున్న సేవలు నేడు జిల్లా గర్వించే స్థాయికి చేరాయి.77వ గణతంత్ర దినోత్సవ వేళ,ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా ఆయన అందుకున్న “జిల్లా ఉత్తమ అధ్యాపక అవార్డు” ఆయన కష్టానికి దక్కిన అసలైన గౌరవం. జుంకీలాల్ గారి ప్రస్థానం సామాన్యమైనది కాదు. ఆకలి తెలిసిన పేదరికం నుంచి వచ్చినా, అక్షరంపై ఉన్న మమకారం ఆయన్ని కుంగదీయనివ్వలేదు. “తాను పడ్డ కష్టం తన విద్యార్థులు పడకూడదు” అనే సంకల్పంతో, ప్రతి విద్యార్థిని ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దుతున్నారు.…

Read More

  వ్యవసాయ కార్మిక సంఘం  నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్. కొత్తగూడెం: 2026జనవరి 23, శుక్రవారం: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ఆవిష్కరించారు, శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలిచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు, వ్యవసాయ, గ్రామీణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, బిజెపి ప్రభుత్వం స్విస్ బ్యాంకులో ఉన్న నల్లదనం తెచ్చి పేదలను లక్షాదికారులను చేస్తానని అనేక మాయ మాటలు చెప్పి మోసం చేసిందన్నారు, దేశంలో పేదలకు ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు,  మహాత్మా…

Read More

ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల టేకులపల్లి పరివర్తన అవాజ్ న్యూస్:    టేకులపల్లి:ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాత్రి టేకులపల్లి సెంటర్లో అత్యంత వైభవంగా టిడిపి నాయకులు అభిమానులు జరుపుకున్నారు. సీనియర్ నాయకుడు టేకులపల్లి టిడిపి మండల కార్యదర్శి గుడిపూడి మోహన్ రావు నాయకులు అభిమానులతో కలిసి 10 కేజీల భారీ కేకును కట్ చేశారు అందరికీ కేకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. టపాసులు బాణాసంచా కాల్చి జై లోకేష్ జై టిడిపి అంటూ కేరింతల కొడుతూ ఆనందోత్సాహాలతో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలతో టేకులపల్లి సెంటర్ సందడి నెలకొంది.భారీగా అభిమానులు ఈ వేడుకలకు తరలివచ్చారు . ఈ కార్యక్రమంలో గుడిపూడి కృష్ణయ్య,కూచిపూడి నాగయ్య,ఏపూరి సీతయ్య, గజ్జల రామ్ శేఖర్, బొగ్గారపు అజయ్, సామినేని సతీష్, నంబూరి అనిల్, రాయల రాజేష్, మూడ్ కుమార్,…

Read More

జనవరి 19న జరిగే కార్మిక,కర్షక ఐక్య ప్రదర్శన జయప్రదం చేయండి.   –రేపాకుల శ్రీనివాస్  జిల్లా ప్రధాన కార్యదర్శి  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. కొత్తగూడెం: 2026జనవరి 17 శనివారం: జనవరి 19వ తేదీన కొత్తగూడెం పాతడిపో నుంచి బస్టాండ్ సెంటర్ వరకు జరిగే కార్మిక, కర్షక ఐక్య ప్రదర్శనను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు, శనివారం నాడు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ,కార్మిక,రైతు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలను విడనాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, జనవరి 19వ తేదీన దేశ వ్యాప్తంగా కార్మికులు,రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు,సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో పేదరికం పెరుగుతుందని అదే సమయంలో కార్పోరేట్ల సంపద విపరీతంగా పెరిగిపోయిందన్నారు, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని…

Read More

మహారాజ్ మందిరంలో రాములు నాయక్ ఘన సన్మానం.   హిందూ పరిరక్షణకు పాటుపడాల.   పాల్వంచ, జనవరి 11:   సేవాలాల్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకునితీసుకుని, సేవ స్ఫూర్తితో బంజారా యువత ముందుకు సాగాలని జగదాంబ సేన వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు నాయక్ అన్నారు. మహారాష్ట్ర వాసిమా జిల్లా పౌరా దేవి సేవాలాల్ మహారాజ్ మందిరంలో పట్టణ పరిధి కరకవాగుకు చెందిన రాములు నాయక్ కు ఆదివారం ఘన సత్కారం లభించింది. రాములు నాయక్ మాట్లాడుతూ.. బంజారా ఆచార వ్యవహారాలను తూచా తప్పక పాటించాలన్నారు. హిందూ ధర్మ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సత్కరించిన సాధుసంతులు, మహారాష్ట్ర నాయకులకు రాములు నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో జితేందర్ మహారాజ్, శంకర్ మహారాజ్, కల్కి భగవాన్, పట్టు రాములు, ధరావత్ కృష్ణ నాయక్, మాలు సాద్, యాకూసాదు, సాధు సంతులు పాల్గొన్నారు.

Read More

  ప్రజాసేవకే నా జీవిత అంకితం అంకిత భావంతో పనిచేసే తత్వం ప్రజల సమస్యను తన సమస్యగా భావించే నాయకుడు అందరి వాడిని ఆదరించండి   ప్రజల మన్నాలు పొందుతూ ఇలాంటి యువ నాయకుడే గ్రామ పంచాయతీకి అవసరమని అంకిత భావంతో పనిచేసే తత్వం ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ గెలుపు దిశగా ప్రయాణిస్తున్న యువ నాయకుడు బోడ బాలు నాయక్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అంటున్న టీకులపల్లి గ్రామపంచాయతీ ప్రజలు   టేకులపల్లి డిసెంబర్ 16 (పరివర్తన ఆవాజ్ న్యూస్) టేకులపల్లి గ్రామపంచాయతీ ప్రజలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా బోడ బాలు నాయక్ వైపు అడ్డుగోడలా నిలుస్తూ అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే అంటూ ప్రచారాన్ని సాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలలోనే ఉంటూ ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ ప్రజల మన్ననాలు పొందుతూ ఎదురులేని నాయకుడిగా ముందుకి నడిపిస్తున్న…

Read More