Author: parivarthanaawaaz
గోపాల్ పేట్‌లో లంచం వ్యవహారం… విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీ వలకు (పరివర్తన అవాజ్ ) నవంబర్ 18, గోపాల్ పేట్‌లో అవినీతి పై ఏసీబీ ముళ్లవల బిగించిందీ… విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ హర్షవర్ధన్ రెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ప్రజలకు సేవ చేయాల్సిన పదవిని వ్యక్తిగత లాభాలకు వాడుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఏసీబీ ఆధ్వర్యంలో జరిగిన అకస్మిక దాడిలో ఆయనను రంగేహస్తాలుగా అరెస్టు చేశారు
బస్సును ఢీకొని యువకుడు మృతి కామారెడ్డి పరివర్తన అవాజ్ ఇల్లందు నవంబర్ 17: కామారెడ్డి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు కామారెడ్డి నుండి పిట్లం వైపు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో హాజీపూర్ గ్రామంలో ఓ ప్రయాణికుడిని దింపేందుకు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయగా బస్సు ఆగింది. ఈ సందర్భంగా వెనుక నుండి వస్తున్న ఫిర్యాదుదారుని తమ్ముడు మాదిగ కాశీరాం (32 సంవత్సరాలు), మంబాజీపేట గ్రామం, లింగంపేట మండలం చెందినవ్యక్తి తన మోటార్‌సైకిల్‌తో బస్సును ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై మృతుని అన్న కాశీరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది.
కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ కొడిప్యాక సాయిరాం ఏకగ్రీవంగా నియామకం అయ్యారు.నియామకం జరిగిన అనంతరం సాయిరాం విలేకరులతో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఈ పదవికి న్యాయం చేస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని సాయిరాం తెలియజేసారు.తన నియామకానికి సహకరించిన డాక్టర్ చంటి ముదిరాజ్ శ్రీమతి సూర స్రవంతి మల్లం వెంకటేశం మరియు వీరమల్ల రమశ్రీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
కోండాపూర్‌లో విషాదం…నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి కింద పడిన కార్మికులు ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు అక్రమ నిర్మాణం అజాగ్రత్త నిర్లక్ష్యం వహించడం వల్లే అమాయకుడి ప్రాణాలు బలి అంటున్న స్థానికులు శేరిలింగంపల్లి సర్కిల్ 20 వ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యానికి అక్రమ నిర్మాణ దారుల ధన దాహానికి బలవుతున్న అమాయకులు శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 15 గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధి కోండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదం వల్ల ఇద్దరు కార్మికుల కుటుంబాలను చీకటిలోకి నెట్టింది. సుమారు మూడు గంటల సమయంలో నాల్గవ అంతస్తులో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు గోవ కర్రలను కడుతున్న సమయంలో ఒక్కసారిగా కర్రలు విరగడంతో వారు నాలుగవ అంతస్తునుండి కిందకు పడిపోయారు. అయితే వెంటనే స్థానికంగా ఉండేవారు వీరిని గమనించి వెంటనే స్థానిక కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ…
విద్యార్థుల హక్కుల పరిరక్షనే ప్రధాన లక్ష్యం ..జాతీయ మానవ హక్కుల కమిషన్ .. శివ శంకర్ దుబ్బాక ( పరివర్తన అవాజ్ ): దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో జాతీయ మానవ హక్కుల సంస్థ దుబ్బాక మండల అధ్యక్షులు పున్న శివశంకర్ జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల మరియు యుపిఎస్ ప్రాథమిక పాఠశాల లో ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. విధ్యార్తులకు మధ్యాహ్న భోజనం పథకంలోనీ ఆహారాలు తనిఖీ చేయడం జరిగింది. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన మెనూ ఆధారంగా భోజనాన్ని అందించాలని సూచించడం జరిగింది. విద్యాలయాల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలపడం జరిగింది. విద్యార్థుల ప్రాథమిక హక్కులను వారికి చెప్పడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న జాతీయ మానవ హక్కుల సంస్థ ద్వారా వారికి సహాయం అందుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి తనిఖీ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సహకరించడం జరిగింది .
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలు? తెలుగు రాష్ట్రాల్లో కూర గాయల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని చూస్తున్నాయి.. కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి పై ప్రభావం పడుతుంది, పలు రకాల కూరగాయలు కిలో రూ”100కు చేరాయి, ఓవైపు మొంథా తుఫాన్ మరోవైపు కార్తీకమాసం నేపథ్యంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి..దీంతో వినియోగదారులను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.సాధారణంగా సీజన్ మారినప్పుడు కొంతమేర ధరల్లో మార్పులు ఉంటాయి కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరు, వరంగల్, వంటి నగరాల్లోనే కాకుండా గ్రామీణమార్కెట్లలోకూడా కూరగాయల ధరలు మండుతున్నాయి.చాలా రకాల కూరగాయలు పావుకేజీకి రూ.30–35 కంటే తక్కువకు దొరకడం లేదు, అంటే కిలోకు రూ.100–120 వరకు పలుకుతున్నాయి. ముఖ్యంగా చిక్కుడు పూల గోబి, క్యారెట్, టమాటో దోసకాయ, బీరకాయ, మిరపకాయ, వంకాయ వంటి సాధారణ కూరగాయలు కూడా మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయి .ఇటీవల మొంథా తుఫాను కారణంగా…
తెలంగాణలో పెరిగిన చలి అవాజ్ న్యూస్ నవంబర్, 13 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూ,లో బుధవారం రాత్రి అత్యంత కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్‌సీయూ ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.రాష్ట్రంలో సగటున 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణో గ్రతలు పడిపోయాయని తెలిపారు. ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు ఈరోజు 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. రాబోయే వారం రోజులు ఇదే తరహా చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం- ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం,…
మెదక్ లో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మెదక్ జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్) మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ అబుల్ కలామ్ ఆజాద్ గారి జన్మదిన వేడుకలను మెదక్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వచనం జరిగింది . అదేవిధంగా దేశానికి కలాం గారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆఫీస్ మొల్సబ్ మెదక్ పట్టణ అధ్యక్షులు గూడూరు ఆంజనేయులు, యువ నాయకులు ఆమీర్, ముసమిల్ రమేష్ ప్రవీణ్ అన్వర్ పాల్గొనడం జరిగింది
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్) మెదక్ మండలం పాతూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్ మంగళవారం ఆకస్మికం గా సందర్శించారు ఈ సందర్బంగా కలెక్టర్… కేంద్రం లో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్ లను పరిశీలించి. ఎప్పటికప్పుడు వచ్చే ధాన్యం వివరాలను అలాగే కొనుగోలు అయిన వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు తేమ వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లు లకు తరలించాలన్నారుసరిపడా టార్ఫాలిన్ లను అందుబాటులో పెట్టుకోవాలని.. వాతావరణ ప్రతికూల ప్రభావం వలన .వర్షం వచ్చే సూచనలు తెలిసినప్పుడు కేంద్రం లో ఉన్న ధాన్యం తడవకుండా వెంటనే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్ధవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఇప్పటివరకు 70 వేల 100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని…
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా.. వరంగల్ జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్) జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనారిటి వెల్ఫేర్ డే, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.వారి జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి జడ్పీ సీఈవో మరియు డిఆర్డిఏ ఇన్చార్జి పి డి రామ్ రెడ్డి తో పాటు వివిధ జిల్లా అధికారులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడమైనది.ఈ సమావేశంలో జిల్లా…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.