Author: parivarthanaawaaz

ఒడిశా గవర్నర్‌తో తెలంగాణ మీడియా ప్రతినిధి బృందం భేటీ    ఒడిశా ప్రగతిశీల వృద్ధితో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు: గవర్నర్ డాక్టర్                                                హరిబాబు కంభంపాటి {హైదరాబాద్ పరివర్తన ఆవాజ్ ఫిబ్రవరి 6 }   పీఐబీ నేతృత్వంలో తెలంగాణ మీడియా ప్రతినిధి బృందం ఈ రోజు లోక్ భవన్‌లో ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని కలిసింది. ప్రతినిధి బృందాన్ని సాదరంగా స్వాగతించిన గవర్నర్… ఒడిశా అభివృద్ధి ప్రయాణం, జాతీయ పురోగతికి పెరుగుతున్న ఒడిశా సహకారం గురించిన విశేషాలను పంచుకున్నారు.మీడియా ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఒడిశా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని, రాష్ట్ర ఆర్థిక పునాదులను బలోపేతం చేసుకుంటోందని అన్నారు. మిగులు ఆదాయం గల రాష్ట్రంగా…

Read More

7వ వార్డు గజవాడ నాగరాజు ఇంటింటి ప్రచారం గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా గజవాడ నాగరాజు {మెదక్ జిల్లా  పరివర్తన ఆవాజ్} మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ఏడవ వార్డు పరిధిలోని గొల్లిపర్తి లో ఆదివారం కాంగ్రెస్ శ్రేణుల రాకతో సందడిగా మారింది. కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ నాగరాజు తన మద్దతు దారులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి, గ్రామస్తుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, గొల్లిపర్తిని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ​వార్డులో ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని, ప్రతి గల్లీలో ఆధునిక మురుగునీటి కాలువలు (Drainage) నిర్మించి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అదేవిధంగా, మట్టి రోడ్ల స్థానంలో నాణ్యమైన సి.సి. రోడ్ల నిర్మాణం…

Read More

 మెదక్ పట్టణంలోని రెండవ. మూడవ వార్డ్ లలో కాంగ్రెస్    పార్టీరాష్ట్ర నాయకులు ఎస్సార్ ప్రసాద్ ఇంటింటి ప్రచారం   (పరివర్తన ఆవాజ్ ) మెదక్ పట్టణంలోని రెండవ మూడవ వార్డ్ ఇంచార్జ్ కాంగ్రెస్ పాటి రాష్ట్ర నాయకులు ఎస్ ఆర్ ప్రసాద్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎరికాలి నరసింహులు. కందుల యశోద మైపాల్ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని ఆయన అన్నారు . అధికార పార్టీలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డ్ లు అభివృద్ధి చెందుతాయనిఅన్నారు ప్రస్తుతం మూడవ వార్డు పరిస్థితి దారుణంగా ఉందని గత ఐదేళ్ల నుండి అధికారంలో ఉన్న స్థానిక నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు ఏ ఒక్క మురికి కాలువ. సీసీ రోడ్డు నిర్మించలేదని ఆయన అన్నారు అభివృద్ధి అంటే ఇంట్లో కూర్చొని చెప్పుడు…

Read More

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకో                                      మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఆసిఫ్  బీబీపేట పరివర్తన ఆవాజ్ జనవరి 30,   బీబీపేట మండల కేంద్రంలో మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ అసిఫ్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆసిఫ్ గారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి రోడ్డుపై ఫ్యామిలీతో నిరసన తెలుపుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారితో బూతు మాటలు తిడుతూ ముస్లిం పోలీస్ అధికారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం సరైన పద్ధతి కాదని . మతం పేరుతో తుర్కోడు అని నోటికి వచ్చిన విధంగా ఒక వర్గం ప్రజలను కించపరుస్తూ మాట్లాడిన కౌశిక్ రెడ్డి నీ పద్ధతులు మార్చుకొని గతంలో నీ బ్రతుకు ఒకసారి ఆలోచించుకో ప్రాణ బిక్ష పెట్టుమని నువ్వు నీతో…

Read More

నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ కామారెడ్డి పరివర్తన ఆవాజ్ జనవరి 30,  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ వార్డు ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఇంచార్జి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సందర్శించి పరిశీలించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గత బుధవారం నుంచి మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 31 చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు అందిన నామినేషన్ల సంఖ్య, నియమించిన ఆపరేటర్ల వివరాలు, అభ్యర్థుల సంఖ్య, FST, SST బృందాల ఏర్పాటు, శిక్షణ తరగతుల…

Read More

        బోడు లో ఘనంగా వనదేవతల జాతర.             సమ్మక్క సారక్క లకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు. టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 29.టేకులపల్లి మండలం బోడు గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల మధ్య గురువారం సారలమ్మ తల్లి బోడు గుట్టపై ఉన్న గద్దెపై కొలువుదీరింది. బోడు చుట్టుపక్కల, గ్రామాలైన ముక్కంపాడు, రామచంద్ర పేట, మురుట్ల , టేకులపల్లి, జంగాలపల్లి గ్రామాల నుండి వనదేవతలైన సమ్మక్క సారమ్మలను గ్రామస్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని,పాడి పంటలను సమృద్ధిగా పండాలని, వనదేవతల దీవెనలు మెండుగా ఉండాలని భక్తులు కోరుకున్నారు.

Read More

జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవో ను తీసుకువచ్చి ఏజెన్సీ నిరుద్యోగ                           యువతను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ప్రభుత్వానికి డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్  జనవరి 29, సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ఏరియాలో ఆర్టికల్ 244(1) పార్ట్ ఏ. బి. సి. డి లను ననుసరించి నివాసాలు, నిధులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, భూముల క్రయ విక్రయాలు స్థానిక గిరిజనులకే 100% శాతం సర్వ హక్కులు ఉంటాయని రాజ్యాంగం చెపుతుంది. కానీ, జీవో నెంబర్.3 జీవోను సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులు ఉద్యోగాలకు…

Read More

           గుండెపోటుతో బల్లెం బిక్షం మృతి. టేకులపల్లి పరివర్తన అవాజ్  జనవరి 29, టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు బల్లెం బిక్షం (50) హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు. ఉపాధ్యాయుడుగా 15 సంవత్సరాలుగా పనిచేసి అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది అనేక మంది మన్ననలు పొందారు. గత ఐదు సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ తరఫున సులానగర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పని చేసారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున చురుకుగా పనిచేసి సర్పంచ్ గెలుపు కు బాసటగా నిలిచాడు. బిక్షం మన మధ్య లేరని గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. బిక్షం కు రాజకీయ ప్రముఖులు గ్రామస్తులు భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

Read More

      రామాయంపేటలో రెండో రోజు 51 నామినేషన్లు దాఖలు                             స్పెషల్ అధికారి సాయిబాబా (పరివర్తన ఆవాజ్ ) మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు అత్యంత ఉత్సాహంగా సాగింది. గురువారం ఒక్కరోజే వివిధ పార్టీల నుంచి,51 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి సాయిబాబా ప్రకటించారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ మద్దతు దారులతో భారీగా తరలి రావడంతో మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో రాజకీయ సందడి నెలకొంది.​పార్టీల వారీగా వివరాలను వెల్లడిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి 24, బీఆర్ఎస్ (BRS) నుంచి 13, బీజేపీ (BJP) నుంచి 10 నామినేషన్లు అందగా,మరో నలుగురు స్వతంత్రులు (ఇండిపెండెంట్లు) తమ నామినేషన్ పత్రాలను సమర్పించారని సాయిబాబా తెలిపారు. పట్టణంలోని శ్రీ శక్తి భవనంలో ఏర్పాటు…

Read More

వైష్ణవ జన తో’ తెలుగు వెర్షన్‌ను ‘గాంధీ మార్గం’ ను నాటక రూపంలో ప్రదర్శించిన సీబీసీ        స్వచ్ఛతా పక్వాడా, అమరవీరుల దినోత్సవం సందర్భంగా       హైదరాబాద్‌లో ‘గాంధీ మార్గం’ కార్యక్రమాన్ని నిర్వహించిన సీబీసీ హైదరాబాద్ (పరివర్తన ఆవాజ్) . స్వచ్ఛతా పక్వాడా, అమరవీరుల దినోత్సవం, వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), తిరుమలగిరి లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సహకారంతో బుధవారం రోజున గాంధీ మార్గం అనే కార్యక్రమం ద్వారా ‘వైష్ణవ జన తో’ భజనను నాటక రూపంలో ప్రదర్శించింది. ప్రదర్శన అనంతరం పెద్దఎత్తున విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. మహాత్మాగాంధీ ఆశయ స్ఫూర్తితో విలువలతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించటం దీని లక్ష్యం. ఈ కార్యక్రమంలో సీబీసీ సీనియర్ అకౌంట్స్ అధికారిణి మంగళ, ఇతర అధికారులు మరియు సిబ్బందితో పాటు…

Read More