Author: parivarthanaawaaz

మత్తుతో జీవితాలు చిత్తు : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 23,  సుజాతనగర్ సెంటర్లో ” చైతన్యం, డ్రగ్స్ పై యుద్ధం” అనే ప్రోగ్రాంలో భాగంగా కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాలతో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్  పాల్గొన్నారు.చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు ,సుజాతనగర్ ఎస్సై రమాదేవి   మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఇట్టి ప్రోగ్రాంలో అబ్దుల్ కలాం కాలేజ్,ధన్వంతర కాలేజ్ ,శ్రీ ఫార్మసి కాలేజ్ మరియు సుజాతనగర్ హైస్కూల్ కు చెందిన స్టూడెంట్స్,అదే విధంగా సుజాతనగర్ మండలానికి చెందిన రాజకీయ నాయకులు,మీడియా వారు మరియు ఇతర పబ్లిక్ మొత్తం దాదాపు 700 మంది పాల్గొన్నారు.డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఈ నెల 15వ తారీకు నుండి వచ్చే నెల 15వ తారీకు వరకు ప్రతిరోజు చేపట్టే చైతన్యo ప్రోగ్రాంలో భాగంగా జనాలకు డ్రగ్స్ గురించి అవగాహన…

Read More

మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన  కలెక్టర్ జితేష్ వి. పాటిల్.  పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 23,  బూర్గంపాడు మండలంలోనిమొరంపల్లి బంజార గ్రామంలో సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను  కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల ఆర్థికాభివృద్ధి దిశగా వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలను సమీకరించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతులు కూరగాయల సాగుతో పాటు బంతిపువ్వులు, కొర్రమీను చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం మరియు మేకల పెంపకం వంటి పలు రంగాలను ఒకే ఆవరణలో నిర్వహించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణం సమీకృత వ్యవసాయం యొక్క ప్రాతినిధ్య మోడల్‌గా నిలుస్తుందని, ఈ ప్రాజెక్ట్‌ను ప్రతి మండలంలో అమలు చేయాలన్న లక్ష్యంతో మొరంపల్లి బంజార గ్రామంలో ప్రారంభించినట్లు కలెక్టర్ వివరించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రతి…

Read More

పాల్వంచ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించిన ఎమ్మెల్యే కూనంనేని పాల్వంచ రూరల్ ( పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 23: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం లో దంతేల బోర ,జగన్నాధ పురం, కేశవా పురం, బసవ తారక కాలనీ, సూరారం గ్రామాల లో రెండు కోట్ల 30 లక్షల అంచనా కలిగిన సిసి రోడ్ల కు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివ రావు మీడియా తో మాట్లాడుతూ పాల్వంచ మండలంలో.ప్రజలు 24 వేలకు పైగా మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించుటకు కృషిచేసిన అందరికీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్రం, కేంద్రం మరియు ఇంకా అనేక రకాల నిధులు తెచ్చి కొత్తగూడెం నియోజకవర్గం లో ప్రతి గ్రామానికి, పట్టణంలో ప్రతి వీధి, ప్రతి గల్లీకి. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్య, తదితర సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా…

Read More

    జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా పరివర్తన ఆవాజ్.మహబూబాబాద్, అక్టోబర్.23 జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మరీనా పెయింట్ ప్రైవేటు లిమిటెడ్, కరీంనగర్, కంపెనీలో ఖాళీగా ఉన్న అడ్మిన్ మేనేజర్, అకౌంట్స్, టెలికాలర్, స్టోర్ ఇంచార్జ్, హెచ్.ఆర్.టీమ్, డేటా ఎంట్రీ, లీగల్ టీమ్, ఆఫీస్ సబార్డినెట్ తదితర పోస్టులకు అర్హత కల్గిన 18-35 వయసు గల స్త్రీ,పురుష అభ్యర్థులకు ఉద్యోగవకాశాలను కల్పించుటకు తేది: 25.10.2025 న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్ధులు తేది: 25.10.2025 న ఉదయం 10.30 గం. ల నుండి మధ్యాన్నం 2.00 గం.ల వరకు జిల్లా కలెక్టరేట్ లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జరుగు జాబ్ మేళాకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, రెజ్యూమ్ తో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి…

Read More

జిల్లా పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య… వరంగల్ జిల్లా ప్రతినిది అక్టోబర్ 23 (పరివర్తన అవాజ్), వరంగల్ జిల్లా పురావస్తు పరిశోధన, ప్రదర్శనశాలను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు. అక్కడ ఉన్న శిలాశాసనాలు, విగ్రహాలు, శిల్పకళా సంపదను ఎంపీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ చరిత్ర, కాకతీయుల సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ప్రాంతపు వారసత్వాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఎంపీ అన్నారు. జిల్లా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సంరక్షణా పనుల గురించి ఎంపీ ఆరా తీశారు. పురాతన శిల్పకళ, కాకతీయ శిలాశాసనాలు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయని, వీటి సంరక్షణ కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు. జిల్లా పురావస్తు అధికారులు…

Read More

మీడియా ఐక్యతతో సమాజంలో న్యాయం నిలవాలి.. పాల్వంచ మీడియా సంఘం పిలుపు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహణ  పాల్వంచ టౌన్ పరివర్తన ఆవాస్  అక్టోబర్ 23 : పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక గిరిజన సంక్షేమ ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షుడు గుంట్రూ వేణు, సెక్రటరీ కుమ్మరి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భం గా పాల్వంచ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో చేరిన కొత్త సభ్యులకు పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు, దిశ దినపత్రిక విలేకరి జవ్వాజి మధు చేతుల మీదుగా కొత్త సభ్యులకు సభ్యత్వ ధృవపత్రాలు అందజేశారు.అనంతరం కొత్త సభ్యులను సంఘంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ మీడియా సమాజంలో నాలుగో స్థంభంగా…

Read More

టేకులపల్లి గ్రామపంచాయతీ లో కొమరం భీమ్ జయంతి వేడుకలు. టేకులపల్లి పరివర్తన అవాజ్  అక్టోబర్ 22, బుధవారం మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్.ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు నిర్వహించారు, ముందుగా టేకులపల్లి సెంటర్ లో ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా గిరిజనుల అభివృద్ధి కొరకు కొమరం భీమ్ చేసిన త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బోడ.బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ అప్పారావు,బర్మావత్ శివకృష్ణ, లచ్చు నాయక్,చీమల రామకృష్ణ, మాజీ సర్పంచుల సంఘ అధ్యక్షుడు రాజేందర్, కరుణాకర్, మాజీ సర్పంచి లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ మండల మహిళఅధ్యక్షురాలు ఆమడ రేణుక, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Read More

శ్రీ కోదండ రామాలయం అయ్యప్ప పీఠం 39 మంది స్వాములు మాల ధారణ. టేకులపల్లి (పరివర్తన ఆవాజ్  అక్టోబర్, 22): కార్తీక మాసం ప్రారంభంసందర్భంగా ఇల్లందు శ్రీ హరి హర క్షేత్రం అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకులు ప్రదీపన్ శర్మచే టేకులపల్లి శ్రీ కోదండ రామాలయం అయ్యప్ప పీఠం 39 మంది అయ్యప్ప భక్త స్వాములు బుధవారం మాల ధరించారు. రామాలయం ప్రధాన అర్చకులు శ్రీరంగం అజయ్ సాయి చక్రిచే రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజ పీఠం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కన్నె, కత్తి, గంట, గద్ద, పేరు, గురుస్వాములు బాధవత్ మాన్సింగ్ స్వామి, బోడ మంగీలాల్ నాయక్ స్వామి, జయంత్ స్వామి, తేజవత్ కోటేష్ స్వామి, జాటోత్ శ్రీనివాస్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More

      రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు కలెక్టర్ రాహుల్ రాజ్        ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ లోనే ధాన్యాన్ని విక్రయించలిబుధవారం కౌడిపల్లి మండల వెల్మ కన్నె గ్రామంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రంన్నీ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో దాదాపు 100 కేంద్రాల్లో దాన్యం రావడం మొదలైంది అన్నారు.కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని అందులో మాయిచ్చరైన ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని తెలిపారు.టోకెన్ అందించడంతోపాటు మిల్లులకు కూడా ట్యాగింగ్ ఇచ్చేస్తున్నామన్నారు.ధాన్యం సరఫరాకు వాహనాలన్నీ సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు బిల్లులు త్వరగా చెల్లించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.రామాయంపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో…

Read More

ఘునాథపల్లిలో వనిత టీ స్టాల్, ఇందిరమ్మ నమూనా ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండ జిల్లా ప్రతినిది అక్టోబర్ 22 (పరివర్తన అవాజ్), రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఎంపీడివో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాల్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం అదే ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇంటిని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామజికంగా ఎదగాలని మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచించారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన…

Read More