Author: parivarthanaawaaz
ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 27 దాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పక్కాగా కార్యచరణ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మెదక్ మండలం రాయనపల్లి గ్రామంలో ఐ.కె.పి ధాన్యం కొన్నిగోలు సెంటర్ ను పరిశీలించారు.ఇసందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అన్నదాతలు ఎంతో శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి,ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలకు వచ్చే చివరి గింజను కొనుగోలు చేసేందుకు జిల్లా లో498 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు .అధికారులు కేంద్రాలను పర్యవేక్షణ చేస్తారని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాన్యం కొనుగోలు పక్కాగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగులు,తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, రైతులకు కనీసం మౌలిక వసతులు ,లోడింగ్ అన్ లోడింగ్ లో జాప్యం రాకుండా తగు రవాణా సదుపాయాలు మొదలగునవన్నీ ప్రతీ…
బాధితు కుటుంబ సభ్యులను పరిమర్శించిన మాజీ ఎమ్మెల్యే ఏం పద్మ దేవేందర్ రెడ్డి. పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 27 మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి, కూతురు మంగ. చందన కర్నూల్ సమీపంలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం శివ్వాయిపల్లి పల్లి గ్రామానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఏం.పద్మ దేవేందర్ రెడ్డి చేరుకొని సంధ్యారాణి,చందన మృత దేహాలకు పూలమాలలు వేసే నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు ఆనంద గౌడ్,సిద్ధ గౌడ్,లను పరామర్శించి మనోధైర్యాన్ని తెలిపారు. బస్సు అగ్నిప్రమాదంలో తల్లి,కూతురు సజీవ దాహనం కావడం చాలా బాధాకరమని అన్నారు.వీరి వెంట మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంజ గౌడ్,రైతు బందు మండల మాజీ అధ్యక్షులు కొత్తపల్లి. కిష్టయ్య,మాజీ ఎంపిటిసి సిద్దయ్య, మాజీ సర్పంచ్ మాదవి రవీందర్, పాపన్నపేట్ మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్,నాయకులు నరేందర్, విట్టల్,…
లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ పరివర్తన అవాజ్ మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం మెదక్ బోధన్ రోడ్ లోని వెంకటేశ్వర గార్డెన్ లో లాటరీ పద్దతిలో వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 49 మద్యం షాపులకు గాను మొత్తం 1420 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ రాహుల్ రాజ్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల…
సర్కిల్ 21 ప్రజావాణిలో మొత్తం 20 పిర్యాధులు శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ అక్టోబర్ 27 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యలని పరిష్కరించడానికి ప్రతి సోమావారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారంనాడు జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో సర్కిల్ 21 డిప్యూటీ కమీషనర్ డి శశి రేఖ, ఏసీపీ నాగిరెడ్డి ,ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి,ఇంజనీరింగ్ విభాగం అధికారిణి శ్రీదేవి,ఎంటోమాలజీ విభాగం అధికారి చిన్న,యుబిడి విభాగం అధికారిణి సమీర , ఎలక్ట్రికల్ సెక్షన్ లక్ష్మి ప్రియా, ప్రజావాణి కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శశిరేఖ మాట్లాడుతూ ఈ కార్యక్రమం లో నేడు మొత్తం 20 ఫీర్యాదులు వచ్చాయని వచ్చినా వాటిలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలపై 7 ఫీర్యాదులు వచ్చాయి రెవెన్యూ లో 5 పిర్యాదులు ఇంజనీరింగ్ విభాగం లో 3 ఫీర్యాదులు సానిటేషన్ లో 2 ఫీర్యాదులు యుబిడి లో 2…
రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు వెన్నెల సృజన్ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు కామారెడ్డి పరివర్తన అవాజ్ అక్టోబర్ 27: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సృజన్ వెన్నెల దంపతులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులను నిర్వహిస్తున్న వెన్నెల ప్రతి సంవత్సరం తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడమే కాకుండా దంపతులిద్దరూ రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని,రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ముందుకు రావాలని, సకాలంలో రక్తం దొరకకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయని అన్నారు,రక్తదానం చేసిన…
జనాభా కు తగిన విధంగా బిసిలకు రాజకీయ రిజర్వేషన్ లు పెంచాల్సిందే. తడికల శివకుమార్ బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 27: ప్రస్తుతం ఉన్న 27% బీసీ రిజర్వేషన్స్ సాధించడం లో బి.ఎస్. పీ పార్టీ కీలక పాత్ర పోషించింద నీ, “ఎవరి జనాభా ఎంతో – వారి వాటా అంత” అనే నినాదం తో దేశంలో పుట్టిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనీ నేడు తెలంగా ణ రాష్ట్రము లో న్యాయ మైన వాటా కోసం జరుగు తున్న 42% బీసీ రిజర్వే షన్స్ పోరాటా నికి బి. ఎస్. పీ పార్టీ పూర్తి మద్దత్తు ఉంటుందని బిఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ తెలిపారు. ఈ సందర్బంగా బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం లో42శాతం బీసీ రిజర్వేషన్స్ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం కోసం వాల్ పోస్టర్…
లింగంపల్లిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 27, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి నగర్ స్వయంసేవకుల పథ సంచలన కార్యక్రమం వైభవంగా స్ఫూర్తివంతంగా కన్నులపండుగగా, పాల్గొన్నవారికే కాకుండా చూసేవారికి కూడా ఉత్సాహాన్నిచ్చే విధంగా జరిగింది. ముందుగా జరిగిన సమావేశంలో సికింద్రాబాద్ విభాగ్ బౌధ్ధిక్ ప్రముఖ్ అచ్చవెల్లి.భాను ప్రకాశ్ తమ వక్త సందేశంలో భాగంగా మాట్లాడుతూ, హిందూ సంఘటన కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించబడింది అన్నారు. సంఘ్ స్వయంసేవకులకు క్రమశిక్షణ, దేశభక్తి వంటి ఉన్నతమైన సద్గుణాలు అలవడే విధంగా శిక్షణనిస్తుంది అన్నారు. సంఘం అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక సమాజసేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది అన్నారు. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద స్మారక కేంద్రం, శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తికేంద్రం, అయోధ్యలోని భవ్యమైన శ్రీరామ మందిరం సంఘ కృషివల్లనే నిర్మించబడ్డాయి అన్నారు. తిరుమల పవిత్రత ఏడుకొండలు కాక రెండు కొండలకు పరిమితం…
కొడుకు పుట్టలేదని 9 నెలల పాపతో సహా బావిలో దూకి వివాహిత ఆత్మహత్య పరివర్తన ఆవాజ్. అక్టోబర్ 25 , మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ గ్రామంలో నివసిస్తున్న చెటుపల్లి శ్రవణ్, స్పందన(24) అనే దంపతుల వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరూ ఆడ పిల్లలే(3 ఏళ్లు, 9 నెలలు) పుట్టడంతో, గత కొంత కాలంగా తీవ్ర మనస్తాపానికి గురైన స్పందనమగ పిల్లవాడు జన్మించలేదని ఆవేదనతో, తన 9 నెలల పాపతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తడిసిన మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి, తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ డిమాండ్ చేశారు. పరివర్తన ఆవాజ్. అక్టోబర్ 25 మహబూబాబాద్ గార్ల మండలంలోని మర్రిగూడెం, సిరిపురం, నగరం, బాలాజీ తండా, సీతంపేట గ్రామాలలో శనివారం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సర్వే చేసి తడిసిన మొక్కజొన్న పంటలను మరియు వరి పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న అకాల వర్షాలకు మొక్కజొన్న పంట తడిసి రైతులు నష్టపోయారు వెంటనే తడిసిన మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట చివరికి చేతికి అందకుండా అకాల వర్షాలకు నష్టపోయి రైతులు లబోదిబోమంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇటువంటి…
ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడలి అధికారుల సమీక్షలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 25 , శుక్రవారం కలెక్టర్ సమీకృత కార్యాలయం లోని సమావేశ మందిరంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీ, పంచాయతీరాజ్, నీటిపారుదల, వ్యవసాయ, పౌరసరపర, శ్రీ సంక్షేమ, పారిశ్రామిక, ఎస్సీ ఎస్టీ బీసీ అభివృద్ధి శాఖల, గృహ నిర్మాణ, విద్యుత్, మున్సిపాలిటీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ రావ్ మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడకుండా…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.