Author: parivarthanaawaaz
ఆరు గ్రామపంచాయతీల రైతు సమన్వయ కమిటీ చారిత్రక నిర్ణయాలు: రైతులకు ఆర్థిక ఊరట! పరివర్తన అవాజ్ చల్లసముద్రం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఉమ్మడి చల్లసముద్రం మరియు మామిడి గుండాల గ్రామపంచాయతీలలోని ఆరు గ్రామపంచాయతీల రైతు సమన్వయ కమిటీ రైతుల సంక్షేమం కోసం కీలక, చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. ఎంతో కాలంగా వ్యాపారస్తులు(ధాన్యం కొనుగోలుదారులు) బస్తాకు తీసుకుంటున్న 72 కేజీల బరువును 71 కేజీలుగా నిర్ణయించడం జరిగింది, హమాలీ కూలీల విషయంలోనూ రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. గతంలో క్వింటాల్‌కు రూ. 85 తీసుకున్న ఛార్జీని రూ. 75 కు నిర్ణయించారు(రైతు కొనుగోలు కేంద్రం వద్ద మాత్రమే).వ్యాపారస్తుల (స్థానిక కొనుగోలుదారుల )వద్ద పాత ధర వర్తిస్తుంది. దీనితో పాటు, అన్ని పంటలపై ‘బిక్షం’ పేరుతో గతంలో వసూలు చేసిన 20 నుంచి 30 కేజీల అదనపు ధాన్యాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కమిటీ తీసుకున్న ఈ రైతు అనుకూల…
ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్ నవంబర్, 03 భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల వారిచే 3/11/2025న సంస్థలో ర్యాగింగ్ రహిత వాతావరణాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ర్యాగింగ్ నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ర్యాగింగ్ యొక్క ప్రతికూల ప్రభావం మరియు అటువంటి కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల కలిగే పరిణామాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు అతిథి వక్తలు ప్రసంగించారు, వారు ర్యాగింగ్ పట్ల సంస్థ యొక్క జీరో-టాలరెన్స్ విధానాన్ని హైలైట్ చేశారు. ర్యాగింగ్ నిరోధక చట్టం మరియు చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్షల గురించి విద్యార్థులకు సమాచారం అందించారు. గౌరవం, గౌరవం మరియు స్నేహపూర్వకత సూత్రాలను నిలబెట్టడానికి మరియు ర్యాగింగ్ యొక్క ఏవైనా సంఘటనలను అధికారులకు నివేదించడానికి విద్యార్థి ప్రతినిధులు ప్రమాణం చేశారు. ర్యాగింగ్…
పాల్వంచలో పెరిగిన అక్రమ ఇసుక రవాణా – ఉదాసీనంగా అధికారులు, స్థానికుల్లో భయాందోళన పాల్వంచ టౌన్ పరివర్తన ఆవాజ్ నవంబర్ 01 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్, సరిహద్దు ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ముర్రేడు వాగు నుంచి పగలూ రాత్రి తేడా లేకుండా దర్జాగా జరుగుతున్న ఈ ఇసుక దందా వెనుక రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల ఉదాసీనత అనేక అనుమానాలను, తీవ్ర ఆరోపణలను రేకెత్తిస్తోంది.అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు చిన్న రోడ్లలో సైతం అతి వేగంగా నడుపుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు డ్రైవర్లు సెల్‌ఫోన్‌ల ను చెవి వద్ద పెట్టు కుని తమ యజమానులకు అప్‌డేట్‌లు ఇస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుండటం మరింత ప్రమాదకరం.చాలామంది డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ట్రాక్టర్లకు కనీసం చెల్లుబాటు అయ్యే పత్రాలు (కాగితాలు) లేకపోవడం నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతుందో…
నేచురల్ జ్యూస్ స్టాల్ ప్రారంభించిన డిఎస్‌పి నరేందర్ గౌడ పరివర్తన ఆవాస్ అక్టోబర్ 31 రామాయంపేట పట్టణంలో, స్థానిక బస్టాండ్ ఎదురుగా శ్రీ సాయి మెడికల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్ జ్యూస్ స్టాల్ ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై బాలరాజు గౌరవ అతిథులుగా హాజరై స్టాల్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైన ఆహారం కూడా అంతే ముఖ్యం అని అన్నారు. ఉదయం వ్యాయామం చేసిన తరువాత ఇలాంటి నాచురల్ జ్యూస్‌లను తాగడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని తెలిపారు. రామాయంపేటలో ఇలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్ స్టాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.స్టాల్ నిర్వాహకుడిని అభినందిస్తూ మాట్లాడిన సీఐ వెంకట రాజా గౌడ్, పట్టణ ప్రజల ఆరోగ్యానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.…
మెదక్ డివిజన్ ట్రాన్స్కో డి ఈ కార్యాలయంలో ఏసీబీ దాడులు 21 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డి ఈ షేక్ చాంద్ షరీఫ్ పాషా మెదక్ పరివర్తన అవాజ్ అక్టోబర్ 30 ఓ రైతు వద్ద నుండి 50,000 డిమాండ్ చేయగా రైతు 9000 ఫోన్పే ద్వారా మిగతా 20,000 ఈరోజు డీ .ఈ ఇస్తుండగా రెడ్ హ్యాంగ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఒక రైతు తన పొలం వద్ద కోటిఫాం ఏర్పాటు కొరకు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం కావాలని డి ఈ ని అడిగా గా 50,000 ఇస్తేనే ట్రాన్స్ఫారం శాంక్షన్ చేస్తానని డి .ఈ షరీఫ్ పాషా చెప్పగా అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించి రెండు రోజుల కిందట 9వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఈరోజు 21000 రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు డి ఈ షేక్…
భారీగా తగ్గిన బంగారం ధరలు పరివర్తన అవాజ్ అక్టోబర్ 30 2025, భారీగా తగ్గిన బంగారం ధరలు గత రెండు మూడు రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,20,490కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,10,450కి పడిపోయింది. వెండి ధర కూడా రూ.1000 తగ్గి కిలో రూ.1,65,000గా ఉంది. ఈ ధరల తగ్గుదల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే విధంగా ఉంది.
విద్యాసంస్థలకు సెలవు ప్రకటన పరివర్తన ఆవాజ్ పెనుబల్లి: మొoథా తూఫాను దృష్ట్యా (బుధవారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నేడు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా, ఈ రోజు చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేగుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి సేవాభావాన్ని చాటారు. రక్తదానం చేసిన సిబ్బందిని మరియు యువతను అదనపు ఎస్పీ ప్రశంసించి వారికి సర్టిఫికేట్లు అందజేశారు. అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ మాట్లాడుతూ, పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందువరసలో ఉంటారు. ముఖ్యంగా రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు…
హరీష్ రావు ఇంట్లో విషాదం.. పరివర్తన అవాజ్ అక్టోబర్ 28 హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. దీంతో తన్నీరు కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు ఆలుముకున్నాయి.ఈ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు, నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరీష్ రావు ఇంటికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివదేహాన్ని ఉంచినట్లు సమాచారం
అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అదంపు ఎస్పి ఎస్. మహేందర్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 27, మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి రాందాస్ చౌరస్తా మీదుగా వెల్కమ్ బోర్డు వరకు ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ, తిరిగి రాందాస్ చౌరస్తా వద్ద ముగిసింది. జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో విధి నిర్వహణలో 14 మంది పోలీసులు ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సెంట్రల్ మరియు రాష్ట్ర పోలీస్ విభాగాల 191 మంది సిబ్బంది విధి…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.