Author: laxman RAO
– ఇంటింటి ప్రచారంలో ముందంజ:- పరివర్తన అవాజ్,కొత్తగూడెం : కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా సిపిఐ నేత ఎస్కే సాబీర పాషా 29వ డివిజన్ అభ్యర్థి మాచర్ల శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను ఆప్యాయంగా వలకరిస్తూ ముందుకు సాగగా, ఆయనకు పలు చోట్ల ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ 29వ డివిజన్లో కార్పోరేషన్ వ్యాప్తంగా సిపిఐకి మంచి ఆదరణ లభిస్తోందని, అనుకూల పవనాలు వీస్తున్నాయని, దీంతో ప్రత్యర్ధుల సిపిఐ అభ్యర్థుల్లో గుబులు మొదలైందన్నారు. నిత్యం ప్రజలతో ఉండే సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా తమతమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయన్నారు. ఎన్నికలు కలుషిత వాతావరణంలో సాగుతున్నాయని, ఓటర్లు మంచిచెడులు ఆలోచించాలని తెలిపారు. ఈ ఎన్నికలు మంచి చెడుల మధ్య సాగుతున్నాయని చెప్పారు. కార్పోరేషన్ పై ఎర్రజెండా ఎగురడం ద్వారా అవినీతి రహిత పాలన అందుతుందని చెప్పారు. ఈ ప్రచారంలో మున్నా…
ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని నేతల హామీ పరివర్తన అవాజ్,కొత్తగూడెం టౌన్ :-మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా మరియు రాష్ట్ర నాయకుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. వార్డు వార్డుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తమ పార్టీ కార్పొరేటర్లు ఎన్నికైతే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. జిల్లాలోని పలు డివిజన్ ల ను సందర్శించిన సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందాల్సిన…
విద్యాసాగర్‌కు ప్రజల బ్రహ్మరథం పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 58వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి దేవులపల్లి విద్యాసాగర్ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలు, నివాస ప్రాంతాలను సందర్శిస్తూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌కు స్థానిక ప్రజలు విశేష స్పందన చూపుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యాసాగర్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. 58వ డివిజన్ ప్రజలకు అవసరమైన తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన రోడ్లు, విద్యుత్ సరఫరా సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తానని తెలిపారు. ప్రజల అవసరాలు తనకు ముఖ్యమని, డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తనను నమ్మి గెలిపిస్తే డివిజన్‌ను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతానని విద్యాసాగర్…
️కార్పొరేషన్ అభివృద్ధికి సిపిఐనే దిక్సూచిఅహంకారులకు కార్పొరేషన్ ఎన్నికలు గుణపాఠం కావాలిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకూనంనేని రోడ్ షోలు, ప్రచార సభలకు అపూర్వ స్పందన పరివర్తన అవాజ్,కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49, 10, 58. 59. 60 డివిజన్లలో నిర్వహించిన భారీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కొత్తగూడెం అభివృద్ధిలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర చిరస్మరణీయమని, బడుగు బలహీన వర్గాల గొంతుకగా సీపీఐ ఎల్లప్పుడూ నిలబడుతుందని స్పష్టం చేశారు. బస్తీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల నుంచి సంక్షేమ ఫలాల పంపినీవరకు వరకు ప్రతి అంశంపై తాము పోరాడుతామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పాలనలో…
పాల్గొన్న ఎక్స్ ఎమ్మెల్సీ ఆర్ ఎల్ డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం లో రాష్ట్రీయ లోక్ దళ్ కార్యాలయం లో, దిలీప్ కుమార్ కపిలవాయి ఎక్స్ ఎంఎల్సీ & రాష్ట్రీయ లోక్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, కట్టా సతీష్ జిల్లా అధ్యక్షులు ఇతర రాష్ట్రీయ లోక్ దళ్ నేతలు స్థానిక చుంచుపల్లి లో గల ఆర్ఎల్డీ పార్టీలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దిలీప్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ 15 స్థానాలలో స్థానిక సంస్థలలో పోటీ చేస్తోందని, ఆర్.ఎల్.డీ కి ఎన్నికల చిహ్నంగా ఫుట్బాల్ కేటాయించబడిందని తెలిపారు. ముఖ్యంగా కొత్తగూడెంలో ముగ్గురు అభ్యర్థులు బరి లో ఉన్నారు అని ఇక్కడి ప్రజలు ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేసి ఆర్.ఎల్.డి అభ్యర్ధులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌లో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వేముల అశోక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆయనకు విశేష ఆదరణ చూపుతూ బ్రహ్మారథం పడుతున్నారు. ప్రచారం సందర్భంగా వేముల అశోక్ మాట్లాడుతూ, తాను గెలిస్తే డివిజన్‌లో ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన తాగునీటి సమస్యలు, రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్ల ఏర్పాటు, కరెంట్ సమస్యల పరిష్కారం, అవసరమైన సర్టిఫికెట్ల సౌకర్యం, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి వంటి ప్రాథమిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. 55వ డివిజన్ ప్రజలకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వేముల అశోక్ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో గెలిచి డివిజన్ అభివృద్ధికి కృషి…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కురిమెల్ల శంకరయ్య మాట్లాడుతూ, బహుజన రాజ్య స్థాపన ద్వారానే సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే అధికారంలోకి బహుజనులే రావాలని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు మౌలిక వసతుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా పేదలకు విద్య, వైద్యం, ఉపాధి, నివాసం వంటి మౌలిక హక్కులు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, వీధి దీపాల వంటి సమస్యలు ఇంకా అనేక ప్రాంతాల్లో పరిష్కారం కాలేదన్నారు.బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం, సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటే ఏనుగు గుర్తుపై ఓటు వేసి బహుజన అభ్యర్థులను గెలిపించాలని ఆయన…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెం 29వ డివిజన్‌లో సీపీఐ పార్టీకి చెందిన 25 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ చేరిక కార్యక్రమాన్ని స్థానిక నాయకుడు వేముల పవన్ కుమార్ సమన్వయం చేశారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చేరిన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వేముల శైలజ, వేముల రాధమ్మ, చాగంటి రవి, చాగంటి సుమ, రాంబాబు, శ్రీను, లక్ష్మి, భాగ్య, భవాని, హసీనా, శ్రీధర్, రాజ్యలక్ష్మి, రమాదేవి, పుష్ప, గోపి, సురేష్, జగదీష్, వినోద్, పిఎన్ఆర్, నాగేష్, ప్రదీప్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. చేరిక కార్యక్రమంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు…
ఎర్ర జెండాతోనే సమస్యలకు పరిస్కారం సిపిఐ అభ్యర్థులకు ఘనవిజయాన్ని అందించండి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో పునరావృతం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం కార్పొరేషన్ జరుగుతున్న ద్విముఖ పోటీల్లో సిపిఐదే ఘనవిజయమని, ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా కొత్తగూడెం కార్పొరేషన్’ను సిపిఐకి అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ సిపిఐ అభ్యర్థి సహేరా మహమ్మద్, 12వ డివిజన్ అభ్యర్థి పడాల ఆకాంక్ష, 12వ డివిజన్ అభ్యర్థి మంద నాగలక్ష్మి లను గెలిపించాలని కోరుతూ బుధవారం డివిజన్ల పరిధిలో ఇంటింటి ప్రచారం, బస్తి సమావేశాలు జరిగాయి. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ న్యాయమైన డివిజన్ల సంఖ్యతో కలిసి పోటీకి సిపిఐ సిద్దపడినప్పటికి పొత్తుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం సరైంది కాదన్నారు. ప్రజాసమస్యలపై స్పందించేది, వాటి పరిస్కారంకోసం…
ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలీ అని ఓటర్లకు విజ్ఞప్తి పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-23వ వార్డు డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూగులోత్ విజయలక్ష్మి, ఉంగరం గుర్తు (ఐదో నెంబర్) పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను నమ్ముకున్న గ్రామాల ఓటర్ లు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తానని, అవినీతికి తావు లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ప్రజల నమ్మకమే తన బలం అని, ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించి, ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గూగులోత్…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.