Author: laxman RAO

పరివర్తన అవాజ్,కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పదవిని సిపిఐ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మేయర్ స్థానం ఎస్టీ (జనరల్) వర్గానికి కేటాయించబడిన నేపథ్యంలో, సిపిఐ తరఫున 52వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన బానోతు కళావతికి ఆ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది…..? ఈ ఎన్నికల్లో సిపిఐ పార్టీకి చెందిన 22 మంది అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీతో జరిగిన అవగాహన ఒప్పందం ఫలించినట్లు సమాచారం. ఈ క్రమంలో మేయర్ పదవిని సిపిఐ పార్టీ దక్కించుకోగా, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి కేటాయించేలా పరస్పర అంగీకారం జరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే మేయర్ ఎన్నిక ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యే వరకు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. సంబంధిత ప్రక్రియ అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read More

భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని 15వ డివిజన్ కార్పొరేటర్‌గా  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకునూరి సుప్రియ గెలుపొందిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన భారత యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దుర్గరాశి సతీష్, యువజన కాంగ్రెస్ నాయకుడు ఆడేపు ప్రదీప్ కుమార్ కలిసి ఆకునూరి సుప్రియను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 15వ డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఆకునూరి సుప్రియను గెలిపించడం అభివృద్ధికి నాంది అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. కొత్తగూడెం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ విజయంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

Read More

  ఎలాంటి సభలు,సమావేశాలు,విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు: ఎస్పీ రోహిత్ రాజ్ శుక్రవారం నాడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఎన్నికల నియమావళి ప్రకారం సభలు,సమావేశాలు,విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు.డీజేల వినియోగం,బాణాసంచా కాల్చడం వంటివి కూడా నిషేధమని తెలియయజేశారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఉంటుందని అన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్,బాంబుస్క్వాడ్స్ తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో పకడ్బందీగా 163 BNSS అమలులో ఉంటుందని అన్నారు.అభ్యర్థులు,ఏజెంట్లు లెక్కింపునకు…

Read More

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుతూ టెట్ పరీక్షలో అర్హత సాధించిన వై. సారయ్య (ఎంఎస్సీ, బీఈడీ) గ్రంథాలయానికి గోడ గడియారాన్ని విరాళంగా అందించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కార్యదర్శి కె. కరుణకుమారి సారయ్యకు శుభాకాంక్షలు తెలియజేసి, గ్రంథాలయానికి విరాళం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథపాలకురాలు జి. మణిమృదుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రంథాలయాన్ని ఉపయోగించి కష్టపడి చదివిన వారికి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్, కార్యదర్శి గ్రంథపాలకురాలు మణిమృదులను అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

Read More

పోలింగ్ సమయం ముగిసినా క్యూలో ఉన్న ప్రతి ఓటరికి అవకాశం : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అరివర్తన్ అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 73.33 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని మూడు అర్బన్ లోకల్ బాడీల పరిధిలో మొత్తం 106 వార్డులు, 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 88,738 మంది, మహిళలు 96,572 మంది, ఇతరులు 38 మంది ఉన్నట్లు వివరించారు. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 1,35,910 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అశ్వరావుపేట మున్సిపాలిటీలో మొత్తం 16,850 మంది ఓటర్లలో 12,839 మంది (76.20%)…

Read More

పోలింగ్ వేళ 21వ డివిజన్‌లో ఉత్సాహభరిత వాతావరణంపరివర్తన అవాజ్, కొత్తగూడెం:మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 21వ డివిజన్‌లో ఈ రోజు పోలింగ్ ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ బూతులు నంబర్లు 66, 67, 68, 69 పరిధిలో ఓటర్ల రద్దీ కనిపిస్తోంది. ఈ సందర్భంగా సొసైటీ మాజీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య బూత్‌ల వద్ద ఓటర్లను కలిసి తమ మద్దతు అభ్యర్థి చింతలపూడి శ్రావణికి ఓటు వేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటు భవిష్యత్తును తీర్చిదిద్దేదని, 21వ డివిజన్ అభివృద్ధి దిశను నిర్ణయించేది ఈరోజు ఓటేనని వారు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల ఆశయాల సాధన కోసం శ్రావణిని గెలిపించాలని కోరారు.“ఒక్కో ఓటు మార్పుకు బాటలు వేస్తుంది. ప్రతి కుటుంబం పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి” అని పిలుపునిచ్చారు.…

Read More

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పాఠశాల ఆవరణలో, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలు సజావుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రి క్రమబద్ధంగా అందేలా చూడాలని ఆదేశించారు. ప్రతి బ్యాలెట్ బండిల్‌పై సీల్, అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఎన్నికల సామగ్రి సరఫరా వ్యవస్థ, రిసెప్షన్ రూమ్ కార్యకలాపాలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే, సిబ్బందికి తాగునీటి వసతి, వైద్య…

Read More

ముదంగుల మహేష్ గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచారం పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. 53వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి ముదంగుల మహేష్ గెలుపును కాంక్షిస్తూ సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి డివిజన్‌లో ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, విద్యావంతుడు మరియు సేవాభావం కలిగిన యువ నాయకుడు ముదంగుల మహేష్ 53వ డివిజన్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారని తెలిపారు. మహేష్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు ముందుండి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రచారంతో 53వ డివిజన్‌లో నూతన ఉత్సాహం నెలకొందని, మహేష్‌కు ప్రజల మద్దతు మరింత బలపడుతోందని స్థానికులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి, యువ నాయకత్వానికి ప్రజలు అండగా నిలుస్తారని బీఆర్ఎస్ శ్రేణులు విశ్వాసం వ్యక్తం…

Read More

ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి కొత్తగూడెం, పరివర్తన అవాజ్:కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 23వ  డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూగులోత్ విజయలక్ష్మి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజల ఆశీస్సులు, మద్దతుతో విజయాన్ని సాధిస్తానని తెలిపారు. వార్డుల అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజలకు అందుబాటులో ఉండే సేవలే తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రతి కుటుంబ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రజలను కలుస్తూ వార్డుల సమస్యలను తెలుసుకుంటున్న విజయలక్ష్మి, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డును అభివృద్ధి దిశగా నడిపిస్తానని అన్నారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఉంగరం గుర్తు (5వ నెంబర్) పై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు…

Read More

పాల్గొన్న  సామాజిక కార్యకర్తలు గులాం మతీన్, లెంటిల్, కీర్తన్, జాయ్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు యువత ముందుకొచ్చింది. “అమూల్యమైన ఓటును అమ్ముకోవద్దు – అభివృద్ధిని ఎంపిక చేసుకోండి” అనే నినాదంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమం జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ఓటర్ల అవగాహన కోసం రూపొందించిన ప్రత్యేక వాల్ పోస్టర్ ను  సామాజిక కార్యకర్తలు గులాం మతీన్, లెంటిల్, కీర్తన్, జాయ్ విడుదల చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఓటును అమ్ముకోవడం వల్ల భవిష్యత్తులో ప్రజలే నష్టపోతారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కొందరు అభ్యర్థులు డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లోనుచేసి ఓటర్లను ప్రభావితం చేయడానికి…

Read More