Author: laxman RAO

పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని నందా తండా గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ మాలోత్ బలరాం నాయకత్వంలో గ్రామంలో శుభ్రత మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త మరియు మురుగునీటి సమస్య గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేది. ఈ సమస్యలను గుర్తించిన సర్పంచ్ మాలోత్ బలరాం వెంటనే చర్యలు చేపట్టి, గ్రామంలోని ప్రధాన వీధులు, కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం గ్రామంలో ప్రత్యేక బృందాల ద్వారా చెత్త తొలగింపు, మురుగు నీటి కాలువల శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో పరిశుభ్రత మెరుగుపడటమే కాకుండా, దోమలు, వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుముఖం పట్టింది.ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సర్పంచ్ మాలోత్ బలరాం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి…

Read More

ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. చుంచుపల్లి బైపాస్ రోడ్డులో ఎంఎస్ పాన్ మహల్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త, యువ కాంగ్రెస్ నాయకుడు మరియు ఎంఎస్ పాన్ మహల్ ప్రొప్రైటర్ మతిన్ ప్రజలకు సేమియాను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌హెచ్ రవి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రంజాన్ పండుగ ప్రాముఖ్యతను వివరించి, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని సేమియాను స్వీకరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ, రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.

Read More

  పరివర్తన అవాజ్,కొత్తగూడెం స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది నుండి శ్రీరామనవమి పర్యంతము అనగా ది. 19-3-2026 గురువారం నుండి ది. 28-3-2026 శనివారం వరకు సకల భక్తజనుల రక్షణార్ధం సకల ప్రజలకు సౌభాగ్య, ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్యము కలుగాలనే సంకల్పముతో పంచాయతన సహితముగా కోటికుంకుమార్చనా మహాయాగమును నిర్వహించటం జరుగుతున్నది. కావున భక్త జనులందరూ ఈ దైవ కార్యక్రమములో పాల్గొని అమ్మవారిని దర్శించి, పూజించి, సేవించి జగదాంబ అనుగ్రహమునకు పాత్రులై సౌభాగ్య, ఆరోగ్య, ఆనంద ఐశ్వర్యములు పొందగలరు. పంచాయతన సహిత కోటికుంకుమార్చన మహాయాగం బ్రహ్మశ్రీ కొండవేటి దత్తాత్రేయ శర్మ మంత్ర శాస్త్రపండితులు వారి ఆధ్వర్యములో నిర్వహించబడును. కోటి కుంకుమార్చన నిర్వహించు ప్రదేశం : శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం (శివాలయం) ప్రగతి నగర్, కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాగమును విజయవంతం చేయగలరని మనవి.

Read More

పరివర్తన ఆవాజ్:-శ్రీ పాండురంగ భజన మందిరంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణంభద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని శ్రీ పాండురంగ భజన మందిరంలో ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని సాయంకాలం పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. దేవాలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాబోయే సంవత్సరంలో జరిగే గ్రహ స్థితులు, పండుగలు, శుభ ముహూర్తాలు, ప్రజల జీవన విధానంపై వాటి ప్రభావం గురించి వివరించారు. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రద్ధగా వినడం జరిగింది. అనంతరం దేవాలయ అర్చకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంతో భజన మందిరం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.

Read More

పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా “పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట, డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి బాధ్యత” అనే నినాదంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రామవరం ప్రాంతానికి చెందిన ప్రజలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మానవహారం ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ యువతలో చైతన్యం కల్పించారు. అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. రామవరం గణేష్ టెంపుల్ చమన్ వద్ద జరిగిన అవగాహన సదస్సులో 2 టౌన్ సీఐ డి. ప్రతాప్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్న పరిస్థితి ఆందోళనకరమని అన్నారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని…

Read More

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-తెలనగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఈ నెల **మార్చి 28న (శనివారం)** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో **జాతీయ లోక్ అదాలత్** నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి ఎం రాజేందర్ గురువారం ఒక ప్రకటన లొ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కక్షిదారులు తమ పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు.* రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు * చెక్ బౌన్స్ కేసులు (NI Act cases)* బ్యాంకు రికవరీ కేసులు* మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు (MVOP)* వివాహ బంధానికి సంబంధించిన కేసులు* ఆస్తి పంపకాల వివాదాలు, అద్దె వివాదాలు మరియు ఇతర…

Read More

  పరివర్తన అవాజ్,కొత్తగూడెం పండగ సందర్బంగా పట్టణంలో రద్దీ పెరిగిన వేళ కొత్తగూడెం–విజయవాడ హైవే రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న BSNL కార్యాలయం ముందు ఓ లారీ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పండగ కారణంగా రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గాని, గాయాలు గాని సంభవించలేదని డ్రైవర్ తెలిపాడు. పండగ సమయంలో వాహనదారులు మరింత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read More

కొత్తగూడెం..ప్రగతి నగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయములో కోటి కుంకుమార్చన యాగ మహోత్సవం.. పరివర్తన అవాజ్,కొత్తగూడెం మహా యాగంలో పాల్గొను భక్తులు చిద్ డాట్ కామ్ (CHIDH.COM)ద్వారా పేర్లు గోత్రములు రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి దత్తాత్రేయ శర్మ..తెలిపారు.కొత్తగూడెం పట్టణం ప్రగతి నగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం (శివాలయం)లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కోటి కుంకుమార్చన మహాయాగ మహోత్సవాన్ని నిర్వహించ సంకల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి పర్యంతము అనగా మార్చి 19,2026 నుండి మార్చి 28 శనివారం వరకు సకల భక్తజనుల రక్షణార్థం సకల ప్రజలకు సౌభాగ్య ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలు కలగాలని సంకల్పంతో పంచాయతన సహితంగా కోటికుంకుమార్చన మహాయాగమును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ,పూజించి, సేవించి జగదాంబ…

Read More

పరివర్తన అవాజ్,కొత్తగూడెం19వ డివిజన్ పరిధిలోని అర్హులైన గర్భిణీ స్త్రీలకు ఉచిత డెలివరీ సేవలు అందించబడనున్నాయని 19వ డివిజన్ కార్పొరేటర్ స్వప్న శంకర్ నాయక్ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన వైద్యసేవలు పొందలేకపోతున్న గర్భిణీలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సోమవారం చుంచుపల్లి మండలం విద్య నగర్ కాలనీ లో గల న్యూ లైఫ్ హాస్పిటల్‌లో చిట్టి రామవరం తండకు చెందిన భూక్య వెన్నెలకు పూర్తిగా ఉచితంగా సురక్షిత డెలివరీ నిర్వహించామని పేర్కొన్నారు. తల్లి–శిశు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వైద్యసేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా బలహీన వర్గాలు, గిరిజన ప్రాంతాల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు. అవసరమైన గర్భిణీలు ముందస్తుగా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం కోసం వైద్య సేవలను మరింత విస్తరించేందుకు కృషి కొనసాగుతుందని, ప్రతి ఇంట్లో ఆరోగ్యకరమైన తల్లి–ఆరోగ్యవంతమైన శిశువు ఉండాలని ఆకాంక్షిస్తున్నామని స్వప్న శంకర్…

Read More

“125 పథకం” ఇందిరమ్మ రాజ్యంలోనే మాయం?” పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం ప్రాంతాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు కుటుంబాలు కరెంటు మీటర్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకున్నా, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు చదువులకు ఇబ్బంది పడుతున్నారని, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా విద్యుత్ కనెక్షన్ లేక ఆదాయం కోల్పోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీల సమస్యలపై స్పందించని (ఎన్పీడీసీఎల్) అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రకటించిన “125 పథకం” కూడా ఎస్సీలకు అందకుండా, కేవలం కాగితాలపైనే మిగిలిపోయిందని ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం, ఎస్సీల మౌలిక అవసరమైన విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేకపోతే అది ఏ రాజ్యం అని ప్రశ్నలు వేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన తెలంగాణ దివ్యాంగుల సేవ సంస్థ…

Read More