గుత్తికోయ గూడెల్లో మలేరియా గుర్తింపు సర్వే
పరివర్తన అవాజ్ న్యూస్ టేకులపల్లి 22 :
టేకులపల్లి మండలంలోని మోట్లగూడెం, సిద్ధారం, నాగారపు జోగు గుత్తికోయ గూడెల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు వైద్య బృందం మలేరియా లక్షణాల గుర్తింపు సర్వే నిర్వహించింది. రక్త నమూనాలు సేకరించి త్వరిత పరీక్షల ద్వారా మలేరియా నిర్ధారణ చేపట్టడంతో పాటు ప్రజలకు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. దోమతెరల వినియోగం, పరిసరాల పరిశుభ్రతపై సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
