Monday, September 14, 2026
Home Politics రావికంపాడు గ్రామంలో నూతన ఏరుసలేం చర్చి ప్రారంభోత్సవం

రావికంపాడు గ్రామంలో నూతన ఏరుసలేం చర్చి ప్రారంభోత్సవం

0
54
IMG-20260117-WA0612

📰 Generate e-Paper Clip

 

పరివర్తన అవాజ్,భద్రాది కొత్తగూడెం

అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఏరుసలేం చర్చి ప్రారంభోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ చర్చిని చర్చి పాస్టర్ మాలోత్ కిరణ్ ప్రార్థనలతో అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గానుగపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి హాజరై మాట్లాడుతూ, గ్రామంలో ఆధ్యాత్మిక కేంద్రాల ఏర్పాటు సామాజిక సమైక్యతకు దోహదపడుతుందని అన్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు పాల్గొని, చర్చి ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోతు రాణియా నాయక్, బానోత్ లక్మ నాయక్, బానోత్ రామోజీ నాయక్, పెండ్యాల పాపారావు తదితరులు పాల్గొని నూతన చర్చి నిర్వహణకు తమ శుభాకాంక్షలు తెలిపారు.

చర్చి ప్రారంభోత్సవానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.