Monday, September 14, 2026
Home Politics నంద తండా గ్రామపంచాయతీలో ముగ్గుల పోటీ ఘన విజయం

నంద తండా గ్రామపంచాయతీలో ముగ్గుల పోటీ ఘన విజయం

0
42
IMG-20260114-WA0326

📰 Generate e-Paper Clip

 

 

పాల్గొన్న సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

నంద తండా గ్రామపంచాయతీలో సంక్రాంతి పండుగను ఈపురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా విజయవంతమయ్యాయి. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.

ఈ కార్యక్రమంలో ఉత్తమ ముగ్గులు వేసిన మహిళలను ఎంపిక చేసి గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ బలరాం మరియు ఉపసర్పంచ్ మంగమ్మ గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మహిళల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించినట్లు వారు తెలిపారు.

గ్రామంలో మహిళల భాగస్వామ్యంతో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు గ్రామస్తులు ప్రశంసించారు. ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ సందడిని మరింత పెంచిందని పాల్గొన్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.