Friday, November 20, 2026
Home Politics –ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం… —పేద కుటుంబాలకు రూ.5...

–ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం… —పేద కుటుంబాలకు రూ.5 లక్షల భరోసా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి…

0
15

📰 Generate e-Paper Clip

–ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కూడా చైర్మన్ సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు అయూబ్ ..

వరంగల్ జిల్లా పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 19

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు స్వర్గీయ  ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ మహమ్మద్ అయూబ్  ఘనంగా నివాళులర్పించారు…తొలుత గ్రేటర్ వరంగల్ 13వ డివిజన్ పరిధిలోని దేశాయిపేట లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి, స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు…అనంతరం కాశీబుగ్గ సెంటర్‌లో ఇందిరమ్మ సేవా సమితి సభ్యులు దూపం సంపత్, రామ యాదగిరి, కూచన రవీందర్  ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ గుండు సుధారాణి  తో కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు…అనంతరం టీపీసీసీ, ప్రజా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి సంబంధించిన కలపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి, పథకం ప్రయోజనాలను వివరించారు…ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అయూబ్  మాట్లాడుతూ…పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కుటుంబ యజమాని మరణించిన సందర్భంలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందించే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని అన్నారు.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు పథకంపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ బీమా నమోదు చేసుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ గుండెటి నరేందర్, వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, మహమ్మద్ కమ్మలుద్దిన్, కాంగ్రెస్ నాయకులు భాషాపాక సదానందం, నల్గొండ రమేష్, కొత్తపల్లి శ్రీనివాస్, గోరంట్ల రాజు, జన్ను వివేక్, సోమలక్మి, పుష్ప తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.