పరివర్తన అవాజ్,హైదరాబాద్ నవంబర్ 9: హైదరాబాద్ లో నిర్వహించిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రతి ఒక్కరికీ చట్టంపై అవగాహన కల్పించి, ప్రజల హక్కుల సాధన కోసం కమిటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకునేలా కమిటీ ప్రతినిధులు మరింత చొరవ చూపాలని సూచించారు. ఈ దిశగా పలు విలువైన సలహాలు, సూచనలు అందించారు. అనంతరం కమిటీ వ్యవస్థాపక ఛైర్మన్, జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతితో కలిసి రాష్ట్ర కార్యదర్శి భూర్ల రేణు కుమార్ సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన పెంపొందిస్తూ, పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఒక బలమైన సాధనంగా నిలుస్తుందని ఈ కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు.




