–ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విద్యావేత్తలతో సమావేశం.. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరు…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబరు 3
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యలను శాసనమండలిలో సమర్థవంతంగా ప్రస్తావించి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేసే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదని, పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలు మరియు వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే నాయకుడిని ఎన్నుకునే ముఖ్యమైన ప్రజాస్వామ్య ప్రక్రియ అని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. విద్యావంతులు ప్రజాస్వామ్య పరిరక్షణలో చురుకైన భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు,రేవూరి ప్రకాష్ రెడ్డి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,కూడా చైర్మన్ గుండు సుధారాణి,వరంగల్ హన్మకొండ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్,ఇనగాల వెంటకట్రంరెడ్డి,తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ,విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




