Saturday, September 26, 2026
Home People —అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి… —MA&UD ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ సాయపు...

—అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి… —MA&UD ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ సాయపు రెడ్డి.. —కమిషనర్ వెంకన్నతో కలిసి అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష..

0
3

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 26

నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ సాయపు రెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం వరంగల్ నగర పర్యటనలో భాగంగా ఆయన GWMC, KUDA ఆధ్వర్యంలో కొనసాగుతున్న, ప్రతిపాదిత వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హనుమకొండ పరిధిలోని కాజీపేట కూడలిలో ప్రతిపాదించిన జంక్షన్ అభివృద్ధి ప్రాంతాన్ని సందర్శించి, చేపట్టనున్న పనుల ప్రణాళిక, మౌలిక వసతులు, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో అభివృద్ధి చేయనున్న ఇతర జంక్షన్ల ప్రతిపాదనలను కూడా పరిశీలించారు.చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనులతో పాటు GWMC ప్రధాన కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పనుల పురోగతిని, వరంగల్ బస్‌స్టేషన్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులను వేగవంతం చేయాలని సూచించారు.అదేవిధంగా ఖిలా వరంగల్ మోటు అభివృద్ధి పనులు, స్తంభంపల్లి ప్రాంతంలో కొనసాగుతున్న ఇన్నర్ రింగ్ రోడ్ పనులు, ఉర్సుగుట్ట చెరువు పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి, STP పనులను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని, నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష—క్షేత్రస్థాయి పర్యటన అనంతరం GWMC కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో కమిషనర్ టి. వెంకన్నతో కలిసి ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ సాయపు రెడ్డి నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే చేపట్టబోయే, ప్రతిపాదించిన ప్రాజెక్టుల ప్రణాళిక, పనుల ప్రస్తుత దశ, అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, కాలపరిమితి తదితర అంశాలపై అధికారులతో కూలంకషంగా చర్చించారు.ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ పనులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సాయపు రెడ్డి సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన పనుల్లో జాప్యానికి తావులేకుండా నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.GWMC సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, KUDA పీఓ అజిత్ రెడ్డి, ఈఈలు రవి కుమార్, సంజయ్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ సుచరణ్, డీఈలు, ఏఈలు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.