—అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి… —MA&UD ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ సాయపు రెడ్డి.. —కమిషనర్ వెంకన్నతో కలిసి అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 26 నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ సాయపు రెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం వరంగల్ నగర పర్యటనలో భాగంగా ఆయన GWMC, KUDA ఆధ్వర్యంలో కొనసాగుతున్న, ప్రతిపాదిత వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హనుమకొండ పరిధిలోని కాజీపేట కూడలిలో ప్రతిపాదించిన జంక్షన్ అభివృద్ధి ప్రాంతాన్ని సందర్శించి, చేపట్టనున్న పనుల ప్రణాళిక, మౌలిక వసతులు, ట్రాఫిక్...