Saturday, September 26, 2026
Home Politics వాల్మీకి సంఘం పెద్దమనిషి బోగిలింగయ్య మృతి పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  సంతాపం..

వాల్మీకి సంఘం పెద్దమనిషి బోగిలింగయ్య మృతి పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  సంతాపం..

0
6

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26

వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని 64 డివిజన్ మడికొండకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, వాల్మీకి సంఘం పెద్దమనిషి బోగి లింగయ్య గారు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా నిర్వహించిన దశదిన కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  హాజరై బోగి లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు  బోగి లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వాల్మీకి సంఘం అభ్యున్నతికి, సమాజ సేవకు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బోగి లింగయ్య మృతి కుటుంబ సభ్యులతో పాటు వాల్మీకి సంఘానికి, ఆయనను అభిమానించే వారందరికీ తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, 64వ డివిజన్ అధ్యక్షులు దువ్వ శ్రీకాంత్,45వ డివిజన్ అధ్యక్షులు హరీష్ రెడ్డి, మెట్టుగుట్ట దేవస్థానం చైర్మెన్ పైడిపాల రఘు చందర్,కాజీపేట దర్గా పాక్స్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం శివరాం, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.