వాల్మీకి సంఘం పెద్దమనిషి బోగిలింగయ్య మృతి పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంతాపం..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని 64 డివిజన్ మడికొండకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, వాల్మీకి సంఘం పెద్దమనిషి బోగి లింగయ్య గారు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా నిర్వహించిన దశదిన కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరై బోగి లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు బోగి లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని...