Saturday, September 26, 2026
Home Politics -వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ డివిజన్ కమిటీల నియామక సమావేశంలో పాల్గొన్న హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల...

-వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ డివిజన్ కమిటీల నియామక సమావేశంలో పాల్గొన్న హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి..

0
7

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 వరంగల్

హనుమకొండ (భట్టుపల్లి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, DCC అధ్యక్షులు  సూచన మేరకు గతంలో రద్దయిన డివిజన్ కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశం స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సూచన మేరకు44, 45, 46 డివిజన్ల అధ్యక్షులు జక్కుల సదానందం, కర్ర హరీష్ రెడ్డి, వస్కుల శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో భట్టుపల్లిలోని AGR గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీల భర్తీ జరుగుతోందని తెలిపారు. ప్రతి డివిజన్‌లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మరియు యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములై డివిజన్ కమిటీల నిర్మాణాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.44, 45, 46, మరియు 64వ డివిజన్ల కమిటీల భర్తీ కోసం 45 వ డివిజన్ అధ్యక్షులు కర్ర హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నియమించబడిన డివిజన్ ఇంచార్జ్ లు కోయ్యాడ శ్రీనివాస్, శనిగరపు వీరేశ లింగం, పాలెం తిరుపతి రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణ ప్రక్రియ క్రమశిక్షణతో, సమయపాలనతో జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుల తో పాటు ఎస్సీ సెల్ ఛైర్మన్ అరూరి సాంబయ్య, నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ డివిజన్ల ప్రతినిధులు, మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ALLADI RAMU
*OFFICE @ PA to ENGALA*
#EngalaVenkatramReddy
#HanumakondaDCC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.