Saturday, September 26, 2026
Home Politics తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం… సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం...

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం… సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం… న్యూశాయంపేటలో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు..

0
6

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26  హనుమకొండ:

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా న్యూశాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి  , వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు  , హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న  తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ, భయపడకుండా పోరాటం చేసిన ఆమె ధైర్యం, తెగువ నేటి తరానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.చాకలి ఐలమ్మ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకురాలు కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహా వీరనారి అని ఎమ్మెల్యే అన్నారు. భూమి, ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. ఎన్ని కష్టాలు, ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా తన హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.చాకలి ఐలమ్మ వంటి మహనీయుల త్యాగాల వల్లనే మన సమాజంలో మార్పుకు బాటలు పడ్డాయి. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సమానత్వం కోసం వారు చేసిన పోరాటాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు.సమాజ అభివృద్ధిలో రజకుల పాత్ర ఎంతో కీలకమని, తరతరాలుగా ప్రజలకు సేవలందిస్తూ తమ వృత్తి ద్వారా సమాజానికి అండగా నిలిచిన రజక సమాజం అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు.చాకలి ఐలమ్మ ఆశయాలు నేటి యువతకు చేరేలా ఆమె చరిత్రను, పోరాట స్ఫూర్తిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే నాయిని పిలుపునిచ్చారు. యువత ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, న్యాయం, మానవతా విలువల కోసం పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,సంఘ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.