Friday, September 25, 2026
Home Health సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు..

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు..

0
13

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 25 వరంగల్

వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ వికాస్ రాజ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, సీఎంవో కార్యదర్శి కె. మాణిక్ రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఆసుపత్రి నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, వివిధ విభాగాల నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించి, ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను, చేపట్టాల్సిన పనులను ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.నిర్మాణంలో ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా, పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు.వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గార్లు ఉన్నతాధికారులకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.