Thursday, September 24, 2026
Home Politics పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? ఇప్పుడు పగటి వేషగాళ్లలా హడావుడి ఎందుకు–జిల్లా అధ్యక్షుడు అయూబ్...

పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? ఇప్పుడు పగటి వేషగాళ్లలా హడావుడి ఎందుకు–జిల్లా అధ్యక్షుడు అయూబ్ ….

0
13

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 24   వరంగల్ జిల్లా

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ గారు ఎంజీఎం ఆస్పత్రి పై మొసలి కన్నీరు కారుస్తూన్న బీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు…

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆయ్యుబ్  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…

అధికారం పోయిన తర్వాత పగటి వేషగాళ్ల మాదిరిగా బీఆర్‌ఎస్‌ నేతలు ఎంజీఎం ఆస్పత్రిపై చేస్తున్న హడావుడి ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎంజీఎం ఆస్పత్రి గురించి పట్టించుకోని నాయకులకు ఇప్పుడు అకస్మాత్తుగా ఎంజీఎంపై ప్రేమ పుట్టుకురావడం విడ్డూరంగా ఉందన్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎంజీఎం ఆస్పత్రిలో కనీస వసతులు కల్పించేందుకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అయూబ్ విమర్శించారు. ఎక్స్‌రే లాంటి కనీస సదుపాయాలను కూడా సక్రమంగా అందుబాటులోకి తీసుకురాలేని పరిస్థితి మీ హయాంలో ఉంటే.. ఇప్పుడు ఎంజీఎం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? అని ప్రశ్నించారు.నూతన ఆస్పత్రి నిర్మాణం పేరుతో హడావుడి చేయడం తప్ప, దాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం కంటే రాజకీయ స్వలాభమే ముఖ్యమా? ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి వదిలేయడం మీ పాలనలో సాధారణంగా మారిపోయింది మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎంజీఎం ఆస్పత్రిలో మౌలిక వసతులు, వైద్య సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అయూబ్ తెలిపారు.సిఎం రేవంత్ రెడ్డి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇప్పటికే పలుమార్లు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని మరియు ఎంజీఎం ఆస్పత్రిపై సమీక్షలు నిర్వహించి, సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఎంజీఎం ఇప్పుడు ప్రతిరోజూ ఎందుకు గుర్తుకొస్తోంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం ఘటనను రాజకీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అయూబ్ విమర్శించారు. పోలీసులు తనపై దాడి చేశారన్న ఆరోపణలపై పూర్తి వాస్తవాలు విచారణలో తేలాల్సి ఉందని, అయితే ఘటనకు సంబంధించిన పూర్తి దృశ్యాలు, ఆధారాలు ప్రజల ముందుంచకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పోలీసులు కొట్టారని చెబుతున్నారు.. అయితే ఆ ఆరోపణకు సంబంధించిన పూర్తి ఆధారం ఎక్కడుంది? ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు.ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతించకపోవడంపై జిల్లా అధ్యక్షుడు అయూబ్ స్పందిస్తూ మీడియా ప్రజలకు వాస్తవాలను తెలియజేసే వారధి ఆస్పత్రిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇలాంటి సందర్భాల్లో పారదర్శకత ఉండాలి అని అన్నారు.మీ పార్టీ అధినేతను ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టి రాజకీయాలు చేయడం ఎందుకు? ఆయనను అసెంబ్లీకి పంపించి ఎంజీఎం సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వినియోగించుకోవాలి కదా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రెస్‌మీట్లలో ఆరోపణలు చేయడం కాకుండా చట్టసభల్లో ప్రశ్నించాలని సూచించారు.ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కావాలా? లేక ఎంజీఎం పేరుతో రాజకీయ డ్రామాలు కావాలా? ప్రజలే నిర్ణయిస్తారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనను కూడా ప్రజలు చూశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను కూడా ప్రజలు చూస్తున్నారు” అని అయూబ్ అన్నారు. చివరగా, ఎంజీఎం ఆస్పత్రి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహమ్మద్ అయూబ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ కమలుద్దీన్, 3వ డివిజన్ అధ్యక్షుడు జన్ను అరుణకర్, 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, 43వ డివిజన్ అధ్యక్షుడు మాడుగుల రాజుకుమార్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.